Weather Report | తెలంగాణలో ఐదు రోజులు ఈదురుగాలులతో వర్షాలు.. ఎల్లో అలెర్ట్‌ జారీ చేసిన వాతావరణశాఖ

Weather Report | తెలంగాణ రాగల ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షం కురుస్తందని పేర్కొంది. ఈ మేరకు […]

Weather Report | తెలంగాణలో ఐదు రోజులు ఈదురుగాలులతో వర్షాలు.. ఎల్లో అలెర్ట్‌ జారీ చేసిన వాతావరణశాఖ

Weather Report | తెలంగాణ రాగల ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షం కురుస్తందని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గురువారం నుంచి శనివారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. అదే సమయంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరించింది. సాధారణం కంటే రెండు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని పేర్కొంది. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో వింత వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి.

మధ్యాహ్నం వరకు మాడుపగిలేలా ఉండలు దంచికొడుతున్నాయి. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా మేఘావృతమై ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తున్నది. హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం పడింది. పలు ప్రాంతాల్లో వడగళ్లు కురిశాయి. మరో వైపు భానుడి ప్రతాపానికి ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత కొద్దిరోజులుగా 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీల వరకు రికార్డవుతున్నాయి.