Raghunandan Rao | అధ్యక్ష పదవికి నాకేం తక్కువ? మూడు పదవుల్లో ఒకటి నాకు ఇవ్వాల్సిందే: MLA రఘునందన్ రావు
Raghunandan Rao | దుబ్బాకలో నన్ను చూసే గెలిపించారు బీజేపీ.. ఎలా ఉంటుందో 2 నెలల్లో తెలుస్తుంది ఎమ్మెల్యే రఘునందన్‌రావు వ్యాఖ్యలు విధాత: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీకి అల్టిమేటం జారీ చేశారు. పార్టీలో తనకు సరైన గుర్తింపు ఇవ్వాలని, మూడు పదవుల్లో ఏదో ఒక పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధ్యక్ష పదవికి తాను అర్హుడిని కానా..? అని ప్రశ్నించారు. పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్‌లో ఏదో ఒకటి పదవి […]

Raghunandan Rao |
- దుబ్బాకలో నన్ను చూసే గెలిపించారు
- బీజేపీ.. ఎలా ఉంటుందో 2 నెలల్లో తెలుస్తుంది
- ఎమ్మెల్యే రఘునందన్‌రావు వ్యాఖ్యలు
విధాత: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీకి అల్టిమేటం జారీ చేశారు. పార్టీలో తనకు సరైన గుర్తింపు ఇవ్వాలని, మూడు పదవుల్లో ఏదో ఒక పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధ్యక్ష పదవికి తాను అర్హుడిని కానా..? అని ప్రశ్నించారు.
పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్‌లో ఏదో ఒకటి పదవి ఇవ్వాలి. జాతీయ అధికార ప్రతినిధి ఇచ్చినా తనకు ఓకే అని చెప్పారు. గత పదేండ్ల నుంచి పార్టీ కోసం పని చేస్తున్నానని గుర్తు చేశారు. కొన్ని విషయాల్లో తన కులమే తనకు శాపం కావొచ్చు అని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలల్లో బీజేపీ ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుందన్నారు.
దుబ్బాక నుంచి రెండోసారి ఎమ్మెల్యే గెలుస్తా..
దుబ్బాక నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక ఎన్నికల్లో తనకెవరూ సాయం చేయలేదన్నారు. తాను బీజేపీలోనే ఉండాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ‘వంద కోట్లు ఖర్చు పెట్టినా మునుగోడులో గెలవలేదు. అదే వంద కోట్లు నాకిస్తే.. తెలంగాణను దున్నేసేవాడిని. దుబ్బాకలో నన్ను చూసే గెలిపించారు’ అని రఘునందన్ రావు పేర్కొన్నారు.
బండి సంజయ్‌ది స్వయంకృతాపరాధమని రఘునందన్‌రావు అన్నారు. భార్య పుస్తెలమ్మి సంజయ్ ఎన్నికల్లో పోటీ చేశారని, అలాంటి సంజయ్ వంద కోట్లతో యాడ్స్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ బొమ్మలతో ఓట్లు రావని, రఘునందన్, ఈటల రాజేందర్ బొమ్మలతోనే ఓట్లు వస్తాయన్నారు.
ఎన్నికల్లో పార్టీ గుర్తు చివరి అంశమే అని పేర్కొన్నారు. పార్టీకి శాసనసభాపక్ష నేత లేడని నడ్డాకు తెలియదని చెప్పారు. తాను గెలిచినందుకే ఈటల బీజేపీలోకి వచ్చారని పేర్కొన్నారు. పదేండ్లలో పార్టీ కోసం తనకంటే ఎక్కువ ఎవరూ కష్టపడలేదన్న రఘునందన్.. సేవకు ప్రతిఫలం రాకపోతే నడ్డాపై మోదీకి ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు.