Bigg Boss7 | బిగ్ బాస్ సీజ‌న్ 7.. లేటెస్ట్ ప్రోమోలో క‌నిపించిన ఈ అమ్మాయి ఎవ‌రో తెలుసా?

Bigg Boss7 | బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచేందుకు బిగ్ బాస్ సీజ‌న్ 7 సిద్ధం అవుతుంది. సెప్టెంబ‌ర్ తొలి వారం నుండి ఈ షో మొద‌లు కానుందని తెలుస్తుండ‌గా, గ‌త కొద్ది రోజులుగా షోకి సంబంధించి అనేక వార్తలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇక నిర్వాహ‌కులు కూడా వ‌రుస ప్రోమోల‌తో సంద‌డి చేస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ప్రోమోతో షో ఓ రేంజ్‌లో ఉంటుంద‌ని, అంతా ఉల్టా పుల్టా అని చెప్పి అంచ‌నాలు బాగా పెంచేశారు […]

  • By: sn    latest    Aug 17, 2023 5:57 PM IST
Bigg Boss7 | బిగ్ బాస్ సీజ‌న్ 7.. లేటెస్ట్ ప్రోమోలో క‌నిపించిన ఈ అమ్మాయి ఎవ‌రో తెలుసా?

Bigg Boss7 |

బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచేందుకు బిగ్ బాస్ సీజ‌న్ 7 సిద్ధం అవుతుంది. సెప్టెంబ‌ర్ తొలి వారం నుండి ఈ షో మొద‌లు కానుందని తెలుస్తుండ‌గా, గ‌త కొద్ది రోజులుగా షోకి సంబంధించి అనేక వార్తలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇక నిర్వాహ‌కులు కూడా వ‌రుస ప్రోమోల‌తో సంద‌డి చేస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ప్రోమోతో షో ఓ రేంజ్‌లో ఉంటుంద‌ని, అంతా ఉల్టా పుల్టా అని చెప్పి అంచ‌నాలు బాగా పెంచేశారు నాగ్.

అయితే ప్రోమోలో చూస్తే ఇందులో ఇద్ద‌రు ప్రేమికులు క‌నిపిస్తారు. కొండపైన ప్రియురాలు ఉండ‌గా, కొండ‌పై నుంచి ప్రియుడు ప‌డి పోతుంటాడు. అప్పుడు ఆమె త‌న చున్నీతో ప్రియుడిని కాపాడే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఆ స‌మ‌యంలో నాగ్ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఇలాంటి క్లైమాక్స్ లు మనం చాలానే చూసేశాం.. ఈసారి క్లైమాక్స్ మార్చేద్దాం అని చెప్పుకొస్తారు.

అయితే ప్రోమో రిలీజైన‌ప్ప‌టి నుంచి ప్రోమోలో కనిపించిన అమ్మాయి ఎవ‌రా అని నెటిజ‌న్స్ ఆరాలు తీయ‌డం మొద‌లు పెట్టారు. తాజాగా ఆ అమ్మాయి పేరు అలేఖ్య రెడ్డి అని తెలిసింది. చాలా సినిమాల‌లో కూడా అలేఖ్య న‌టించింది. సైడ్ రోల్స్ లో ఎక్కువ‌గా క‌నిపిస్తూ ఉంటుంది. అశోక వనంలో అర్జున కల్యాణం , ఇంటింటి రామాయణం, అర్థమైందా అర్జున్ కుమార్ లాంటి సినిమాలు చూసిన వారు ఈ అమ్మాయిని ఇట్టే గుర్తుప‌డ‌తారు.

అయితే ప్రోమోలో సంద‌డి చేసిన అలేఖ్య‌ని బిగ్ బాస్ షోలోకి తీసుకొస్తారా అని కొంద‌రు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ 7 కంటెస్టెంట్స్ వీరే అంటూ పలు లిస్ట్‌లు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఓ లిస్ట్ చ‌క్క‌ర్లు కొడుతుండగా, అందులో 12 మంది మగవారు, ఆరుగురు ఆడవారు ఉన్నారు.

లిస్ట్ చూస్తే తెలుగు హీరో శివాజీ, అమర్‌దీప్, ఆట సందీప్, బొంబాయ్ భోలే, బుల్లెట్ భాస్కర్, న‌రేష్, మ‌హేష్‌, విలేజ్ షో అనీల్, పల్ల‌వి ప్ర‌శాంత్, యువ సామ్రాట్, సాగ‌ర్, అంజ‌లి, శోభాశెట్టి, మోహన భోగరాజు, ఐశ్వర్య పిస్సే, శీతల్ గౌతమన్, శుభ శ్రీ ఇలా ప‌లువురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ లో సంద‌డి చేయ‌నున్నార‌ని చెబుతున్నారు. మ‌రి ఈ వార్త‌ల‌లో నిజ‌మెంత ఉందో చూడాల్సి ఉంది.