Niharika | ఇద్ద‌రిలో ముందు విడాకులు కోరింది ఎవ‌రు.. ఆ లాయ‌రే నిహారికకి విడాకులు ఇప్పించాడా..!

Niharika ఇప్పుడు ఎవరి నోట విన్నా కూడా నిహారిక‌, చైత‌న్య విడాకుల గురించే తెగ చ‌ర్చ న‌డుస్తుంది. గ‌త కొద్ది రోజులుగా వీరి విడాకుల వ్య‌వ‌హారంపై అనేక వార్త‌లు వ‌స్తున్నా కూడా ఎవ‌రు స్పందించ‌డం లేదు. దీంతో నిహారిక‌- చైత‌న్య‌ల విడాకుల వ్య‌వహారం స‌స్పెన్స్‌గానే ఉండిపోయింది. అయితే జూన్ 5నే వీరిద్ద‌రికి విడాకులు మంజూరు కాగా, అందుకు సంబంధించిన పిటీష‌న్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంది. దీంతో నిహారిక‌, చైత‌న్య‌ల విడాకుల అంశంపై అంద‌రికి ఓ క్లారిటీ […]

  • By: sn    latest    Jul 05, 2023 2:17 AM IST
Niharika | ఇద్ద‌రిలో ముందు విడాకులు కోరింది ఎవ‌రు.. ఆ లాయ‌రే నిహారికకి విడాకులు ఇప్పించాడా..!

Niharika

ఇప్పుడు ఎవరి నోట విన్నా కూడా నిహారిక‌, చైత‌న్య విడాకుల గురించే తెగ చ‌ర్చ న‌డుస్తుంది. గ‌త కొద్ది రోజులుగా వీరి విడాకుల వ్య‌వ‌హారంపై అనేక వార్త‌లు వ‌స్తున్నా కూడా ఎవ‌రు స్పందించ‌డం లేదు. దీంతో నిహారిక‌- చైత‌న్య‌ల విడాకుల వ్య‌వహారం స‌స్పెన్స్‌గానే ఉండిపోయింది.

అయితే జూన్ 5నే వీరిద్ద‌రికి విడాకులు మంజూరు కాగా, అందుకు సంబంధించిన పిటీష‌న్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంది. దీంతో నిహారిక‌, చైత‌న్య‌ల విడాకుల అంశంపై అంద‌రికి ఓ క్లారిటీ వ‌చ్చేసింది. అయితే ఈ ఇద్ద‌రిలో ముందుగా ఎవ‌రు కోర్టులో పిటీష‌న్‌లో వేసారనే దానిపై చ‌ర్చ న‌డుస్తుండ‌గా, కోర్టులో చేసిన పిటిషన్ ప్రకారం.. ముందుగా చైతన్యనే విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు అర్ధ‌మ‌వుతుంది.

సోష‌ల్ మీడియా నుండి పెళ్లి ఫోటోల‌ని ముందుగా తొల‌గించింది కూడా చైత‌న్య‌నే. నిహారిక వ‌ల‌న ప‌లు ఇబ్బందులు ప‌డ్డ చైత‌న్య ఆమె నుండి విడాకులు తీసుకోవాల‌ని భావించి ముందుగా పిటీష‌న్ వేసిన‌ట్టు తెలుస్తుంది. అనంత‌రం నిహారిక పిటీష‌న్ వేయ‌గా, ఆమె త‌ర‌పు లాయ‌ర్ ఎవ‌ర‌నే దానిపై కూడా చ‌ర్చ న‌డుస్తుంది.

నిహారిక త‌రపున పిటీష‌న్ వేసింది క‌ళ్యాణ్ దిలీప్ సుంక‌ర‌. అత‌ను జ‌న‌సేన‌కి మ‌ద్దతు దారుడిగా ఉన్నారు. నాగ‌బాబుకి కూడా చాలా క్లోజ్. ఈ క్రమంలోనే ఆయ‌న నిహారిక త‌ర‌పున పిటీషన్ వేసిన‌ట్టు తెలుస్తుంది. కాగా, నిహారిక, చైతన్య జొన్నలగడ్డకు జూన్ 5న కోర్టు విడాకులు మంజూరు చేసింది.

he is the lawyer for niharika in divorce dtr

విడాకులకు దరఖాస్తు చేసుకున్నాకా.. కోర్టులో 6 నెలలు గడువు ఇస్తుంది. ఆ లోపు వారిద్ద‌రు కలిసి ఉండాలనుకుంటే.. ఆ విడాకుల పిటిషన్ కొట్టేస్తోంది. కాగా, నిహారిక‌, చైత‌న్య‌ల వివాహం డిసెంబ‌ర్ 9, 2029న రాజ‌స్తాన్‌లో అట్ట‌హాసంగా జరిగింది.

పెళ్లి త‌ర్వాత కూడా వీరిద్ద‌రు చాలా అన్యోన్యంగా ఉన్నారు. సోష‌ల్ మీడియాలో కూడా ఇద్ద‌రు చాలా అన్యోన్యంగా ఉన్న పిక్స్ షేర్ చేశారు. అయితే ఏమైందో ఏమో కాని ఊహించ‌ని విధంగా డైవర్స్ తీసుకొని అంద‌రికి షాకిచ్చారు. ఇదిలా ఉంటే చైత‌న్య రీసెంట్‌గా త‌న సోష‌ల్ మీడియా పేజ్‌లో ఒక ఆశ్ర‌మం పిక్ షేర్ చేసి మ‌న‌శ్శాంతి కోసం అక్క‌డికి వెళ్లిన‌ట్టు తెలియ‌జేశాడు.