విధాత: నటసింహం నందమూరి బాలయ్య అంటే సినిమా ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. ఎన్టీరామారావు (NTR) నటవారసుడుగా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. వరుస హిట్లతో బాలయ్య స్టార్ హీరోగా ఎదిగారు. స్టార్ హీరోలు చిరంజీవి నాగార్జున వెంకటేష్‌లతో కలిసి నేటికి పోటీ పడుతున్నారు.
ఇదిలా ఉంటే బాలయ్య సినిమా లైఫ్ గురించి ప్రతిఒక్కరికీ తెలుసు కానీ ఆయన రియల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. వారి నిజ జీవితంలో కొన్ని ఆసక్త్రిర విషయాలు చాలా దాగి ఉన్నాయి. అందులో ముఖ్యమైంది బాలకృష్ణ వివాహం. బాలయ్య వివాహనికి ఎన్టీఆర్, హరికృష్ణలు హాజదవ్వలేదనే విషయం మీకు తెలుసా. అయితే ఈ కథనం మీ కోసమే.
ఎన్టీఆర్ కుమారుడు నటుడు బాలకృష్ణ పెళ్లి ఏలా జరగాలి.. అతిరథుల సమక్షంలో ఆంగరంగ వైభవంగా జరగి ఉంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు కానీ అలా జరుగలేదు. ఆఖరికి తండ్రి హజరవకుండానే బాలయ్య వివాహం జరిగిఇంది. వివరాల్లోకి వెళితే..
ఎవరున్నా లేకున్నా”కల్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా అచ్చం అలాంటి ఘటనే ఇది.. సినిమాల్తెలో బిజీగా ఉన్నప్పుడే తెలుగు ప్రజలకు సేవ చెయ్యాలనే సదుద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆ పార్టీ పనుల్లో నిమగ్నయ్యారు ఎన్టీఆర్.
పార్టీ స్థాపించిన అనంతరం సలహా, సూచనల కోసం ఎన్టీఆర్ ఓ రోజు ఈనాడు దినపత్రిక ఆధినేత రామోజీరావు ఇంటికి వెళ్లారు. అక్కడికి ఒక అమ్మాయి టీ, పలహారం తీసుకొని రాగా ఆ అమ్మాయి గురించి రామోజీరావుతో ఆరా తీశారు ఎన్టీఆర్. ఆమె రామోజీరావు ప్రాణ స్నేహితుడు SRMT ట్రాన్స్‌పోర్ట్ ఆధినేత సూర్యారావు అమ్మాయి వసుంధర. రామోజీరావు చొరవతో సంబంధం కుదిరింది. ముహూర్తం కూడా పెట్టేసుకున్నారు.
కానీ తెలుగుదేశం పార్టీ నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఎన్టీఆర్‌కు సమయం కుదరక కుమారుడు బాలకృష్ణ పెళ్లికి హాజరు కాలేకపోయారు. అంతేగాక తండ్రి ఎన్టీఆర్‌కు సహాయకుడిగా ఉన్న హరికృష్ణ కూడా బాలకృష్ణ పెళ్లికి హాజరుకాలేదు. బాలకృష్ణ దంపతులకు మొదటి బిడ్డ బ్రాహ్మణి పుట్టిన తర్వాత అన్నప్రాసన తదితర కార్యక్రమాలు ఎన్టీఆర్ దగ్గరుండి చూసుకున్నారు.