శృంగారానికి నిరాకరణ.. భార్యను హత్య చేసిన భర్త
Maharashtra | ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. భార్య శృంగారానికి నిరాకరించిందని ఆమెను గొంతు నులిమి చంపాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. యావత్మల్ జిల్లాలోని పోఫాలీ గ్రామానికి చెందిన మాయ అనే వివాహిత తన భర్తతో కలిసి ఉంటోంది. అయితే ఇటీవల ఓ రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఓ రాత్రి భార్య శృంగారానికి నిరాకరించింది. దీంతో ఆవేశంతో ఊగిపోయిన భర్త.. భార్యపై దాడి […]

Maharashtra | ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. భార్య శృంగారానికి నిరాకరించిందని ఆమెను గొంతు నులిమి చంపాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. యావత్మల్ జిల్లాలోని పోఫాలీ గ్రామానికి చెందిన మాయ అనే వివాహిత తన భర్తతో కలిసి ఉంటోంది. అయితే ఇటీవల ఓ రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఓ రాత్రి భార్య శృంగారానికి నిరాకరించింది. దీంతో ఆవేశంతో ఊగిపోయిన భర్త.. భార్యపై దాడి చేశాడు. ఆమె గొంతు నులిమి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని సంజయ్ సఖ్రేగా పోలీసులు గుర్తించారు. సంజయ్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.