Wife Murder | గ‌ర్భం దాల్చ‌ని భార్య‌.. దారుణంగా చంపిన భర్త‌

Wife Murder | ఓ భ‌ర్త దారుణానికి పాల్ప‌డ్డాడు. వివాహామై ఏండ్లు గ‌డుస్తున్న‌ప్ప‌టికీ భార్య గ‌ర్భం దాల్చ‌డం లేదు. దీంతో తీవ్ర అస‌హ‌నానికి గురైన భ‌ర్త భార్య‌ను చంపేశాడు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని థానే జిల్లాలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. థానే జిల్లాకు చెందిన ఓ 37 ఏండ్ల వ్య‌క్తి స్థానికంగా ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీలో ఉద్యోగం చేస్తున్నాడు. 35 ఏండ్ల వ‌య‌సున్న త‌న భార్య‌తో క‌లిసి ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీ కాల‌నీలో […]

Wife Murder | గ‌ర్భం దాల్చ‌ని భార్య‌.. దారుణంగా చంపిన భర్త‌

Wife Murder | ఓ భ‌ర్త దారుణానికి పాల్ప‌డ్డాడు. వివాహామై ఏండ్లు గ‌డుస్తున్న‌ప్ప‌టికీ భార్య గ‌ర్భం దాల్చ‌డం లేదు. దీంతో తీవ్ర అస‌హ‌నానికి గురైన భ‌ర్త భార్య‌ను చంపేశాడు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని థానే జిల్లాలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది.

థానే జిల్లాకు చెందిన ఓ 37 ఏండ్ల వ్య‌క్తి స్థానికంగా ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీలో ఉద్యోగం చేస్తున్నాడు. 35 ఏండ్ల వ‌య‌సున్న త‌న భార్య‌తో క‌లిసి ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీ కాల‌నీలో ఉంటున్నాడు. అయితే ఈ దంప‌తుల‌కు కొన్నేండ్ల క్రితం వివాహ‌మైంది. కానీ భార్య గ‌ర్భం దాల్చ‌డం లేదు. దీంతో ఇరువురి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి.

అయితే ఆదివారం సాయంత్రం ఇదే విష‌యంలో ఇరువురి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తీవ్ర ఆగ్ర‌హావేశాల‌కు లోనైన భ‌ర్త‌.. ప‌దునైన ఆయుధంతో భార్య‌ను పొడిచి చంపాడు. స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.