బిడ్డను కాపాడుకునేందుకు ఆవును ఎదురించిన మహిళ.. వీడియో వైరల్

విధాత: ఆవులు చాలా మటుకు ఎవరికీ హానీ కలిగించవు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అలా నడుచుకుంటూ వెళ్తున్న వారిపై కొమ్ములతో దాడి చేసి గాయ పరుస్తాయి. ఆ మాదిరిగానే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తల్లీబిడ్డపై ఓ ఆవు దాడి చేసింది. తన బిడ్డ ప్రాణాలను కాపాడుకునేందుకు ఆవును ఆ తల్లి ఎదురించింది. వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని మోబ్రీ సిటీలోని లక్ష్మీనారాయణ సొసైటీ అది. శుక్రవారం ఉదయం ఓ మహిళ తన బిడ్డతో కలిసి రోడ్డుపై […]

  • By: krs    latest    Oct 25, 2022 6:14 AM IST
బిడ్డను కాపాడుకునేందుకు ఆవును ఎదురించిన మహిళ.. వీడియో వైరల్

విధాత: ఆవులు చాలా మటుకు ఎవరికీ హానీ కలిగించవు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అలా నడుచుకుంటూ వెళ్తున్న వారిపై కొమ్ములతో దాడి చేసి గాయ పరుస్తాయి. ఆ మాదిరిగానే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తల్లీబిడ్డపై ఓ ఆవు దాడి చేసింది. తన బిడ్డ ప్రాణాలను కాపాడుకునేందుకు ఆవును ఆ తల్లి ఎదురించింది.

వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని మోబ్రీ సిటీలోని లక్ష్మీనారాయణ సొసైటీ అది. శుక్రవారం ఉదయం ఓ మహిళ తన బిడ్డతో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. అప్పటివరకు సైలెంట్‌గా ఉన్న ఆవు.. తల్లీకుమారుడిని చూసి వారి పైకి దూసుకొచ్చింది. మొదట బిడ్డపై ఆవు దాడి చేసే సరికి తల్లి బెదిరిపోయింది.

అయినప్పటికీ వెనుకాడకుండా.. ఆవును ఎదురించి, తన ప్రాణాలను ఫణంగా పెట్టి, బిడ్డ ప్రాణాలను కాపాడుకుంది. ఆవు కాసేపు తల్లీకుమారుడిపై దాడి చేసినప్పటికీ.. సదరు మహిళ బెదరకుండా వీరోచిత పోరాటం చేసింది.

ఆవు దాడి చేస్తున్న సమయంలో ఆమె గట్టిగా అరవడంతో స్థానికులు అప్రమత్తమై అక్కడికి వచ్చి ఆవును అక్కడ్నుంచి వెళ్లగొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది