Woman in Coma | 31 ఏండ్లు కోమాలో ఉండి మరణించిన భార్య.. తల్లడిల్లిన భర్త
Woman in Coma | ఇది హృదయ విదారక ఘటన.. ఓ మహిళ 31 ఏండ్ల పాటు కోమాలో ఉండి, చివరకు గుండెపోటుతో మరణించింది. తన భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త తల్లడిల్లిపోయాడు. తమ కలలన్నీ ఆవిరైపోయాయని బోరున విలపించాడు. ఇటలీకి చెందిన ఏంజెలో ఫరైనా అనే యువకుడు.. మిరియం విసిన్‌టిన్ అనే యువతిని దాదాపు 32 ఏండ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లి చేసుకున్న 18 నెలలకే మిరియం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. […]
Woman in Coma | ఇది హృదయ విదారక ఘటన.. ఓ మహిళ 31 ఏండ్ల పాటు కోమాలో ఉండి, చివరకు గుండెపోటుతో మరణించింది. తన భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త తల్లడిల్లిపోయాడు. తమ కలలన్నీ ఆవిరైపోయాయని బోరున విలపించాడు.
ఇటలీకి చెందిన ఏంజెలో ఫరైనా అనే యువకుడు.. మిరియం విసిన్‌టిన్ అనే యువతిని దాదాపు 32 ఏండ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లి చేసుకున్న 18 నెలలకే మిరియం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని వస్తుండగా, మిరియం కారు ఓ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో మిరియం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై కోమాలోకి వెళ్లిపోయింది.
ఈ ఘటన 1991లో జరగ్గా.. నాటి నుంచి నేటి వరకు మిరియం కోమాలోనే ఉండిపోయింది. ఆమెకు భర్త ఏంజెలో దగ్గరుండి సపర్యలు చేస్తూనే ఉన్నాడు. రెండు నెలల క్రితం ఆమె ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. చివరకు గత బుధవారం శాన్ బస్సియానో హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా, గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయింది మిరియం.
ఈ సందర్భంగా ఏంజెలో మాట్లాడుతూ.. తామిద్దరం చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నాం. వివాహం చేసుకున్న 18 నెలలకే ఈ ప్రమాదం జరిగింది. ఎక్కువ కాలం కలిసి జీవించలేకపోయాం. పిల్లలను కూడా కనలేకపోయాం. ఎన్నో కలలు ఆవిరై పోయాయి. ఇప్పుడు ఆమె స్వర్గంలో ఉంది. ఇలాంటి ఘటన ఎవరి జీవితంలో కూడా చోటు చేసుకోవద్దని కోరుకుంటున్నానని ఏంజెలో కన్నీటి పర్యంతమయ్యాడు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram