టెంపర్‌ సిన్‌ రిపీట్‌: మహిళపై సామూహిక అత్యాచారం.. ప్రైవేటు భాగాల్లో ఇనుపరాడ్లతో దాడి

ఓ మహిళను ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రెండు రోజుల పాటు నిర్బంధించి, ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆమె ప్రయివేటు భాగాల్లో ఇనుప రాడ్లతో దాడి చేసి చొప్పించారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన 40 ఏండ్ల మహిళ బర్త్ డే పార్టీ నిమిత్తం ఇటీవల ఘజియాబాద్ కు వెళ్లింది. ఆదివారం రోజు పుట్టిన రోజు వేడుకలు ముగియగానే, ఆమెను సోదరుడు బస్టాండ్‌లో […]

టెంపర్‌ సిన్‌ రిపీట్‌: మహిళపై సామూహిక అత్యాచారం.. ప్రైవేటు భాగాల్లో ఇనుపరాడ్లతో దాడి

ఓ మహిళను ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రెండు రోజుల పాటు నిర్బంధించి, ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆమె ప్రయివేటు భాగాల్లో ఇనుప రాడ్లతో దాడి చేసి చొప్పించారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన 40 ఏండ్ల మహిళ బర్త్ డే పార్టీ నిమిత్తం ఇటీవల ఘజియాబాద్ కు వెళ్లింది. ఆదివారం రోజు పుట్టిన రోజు వేడుకలు ముగియగానే, ఆమెను సోదరుడు బస్టాండ్‌లో వదిలేసి వెళ్లిపోయాడు. కాసేపటికే ఓ ఐదుగురు వ్యక్తులు.. కారులో వచ్చి బలవంతంగా ఆమెను ఎక్కించుకుని, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడే రెండు రోజుల పాటు బంధించి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆమె ప్రయివేటు భాగాల్లోకి ఇనుప రాడ్లు చొప్పించి, పైశాచిక ఆనందం పొందారు.

ఇక మంగళవారం రోజు బాధితురాలిని ఢిల్లీకి సమీపంలోని ఆశ్రం రోడ్డులో వదిలేసి వెళ్లిపోయారు. ఘజియాబాద్ పోలీసులకు సమాచారం అందడంతో.. అక్కడికి చేరుకుని, మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసుకున్నారు. భూ తగాదాల వల్లే తెలిసిన వ్యక్తే తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది. దీంతో ఐదుగురిలో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

తీవ్రంగా స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్

ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ తీవ్రంగా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. బాధితురాలి ప్రయివేటు భాగాల్లోనే ఇనుప రాడ్లు ఉన్నాయని తెలిపింది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని స్వాతి మాలివాల్ స్పష్టం చేశారు.