Bastar Tribals | ఎర్ర చీమల చట్నీ.. తిన్నారంటే..

Bastar Tribals | ఒక్కో ఏరియాలో ఒక్కో రకం ఫుడ్‌ దొరుకుతుంది. ప్రతి ప్రాంతంలోనూ అక్కడి స్పెషల్‌ అంటూ ఒకటి ఉంటుంది. అలాంటి ఒక స్పెషల్‌ను రుచిచూశారు ఓ టూరిస్ట్‌. తను వెళ్లిన చోట ఉండేవారు ఇష్టంగా తినే ఆ వంటకం పేరు వింటే ఇబ్బందిగా ఉంటుందేమోగానీ.. తింటే మాత్రం వహ్‌వా అంటారంటున్నారు ఆమె. ఇంతకీ ఏమా వంటకం.. ఎక్కడిదా రుచి? విధాత: ఏదైనా ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడి లోకల్‌ మార్కెట్‌కు వెళ్లటం, లేదా అక్కడి సంప్రదాయ […]

  • Publish Date - April 7, 2023 / 06:10 PM IST

Bastar Tribals | ఒక్కో ఏరియాలో ఒక్కో రకం ఫుడ్‌ దొరుకుతుంది. ప్రతి ప్రాంతంలోనూ అక్కడి స్పెషల్‌ అంటూ ఒకటి ఉంటుంది. అలాంటి ఒక స్పెషల్‌ను రుచిచూశారు ఓ టూరిస్ట్‌. తను వెళ్లిన చోట ఉండేవారు ఇష్టంగా తినే ఆ వంటకం పేరు వింటే ఇబ్బందిగా ఉంటుందేమోగానీ.. తింటే మాత్రం వహ్‌వా అంటారంటున్నారు ఆమె. ఇంతకీ ఏమా వంటకం.. ఎక్కడిదా రుచి?

విధాత: ఏదైనా ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడి లోకల్‌ మార్కెట్‌కు వెళ్లటం, లేదా అక్కడి సంప్రదాయ వస్త్రాలు కొనుగోలు చేయడం.. చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు తిరిగిరావడం.. అన్నింటికి మించి.. అక్కడ మాంచి.. ఫేమస్‌ అయిన లోకల్‌ ఫుడ్‌ తినడం.. ఇవీ సహజంగా మన లిస్టులో ఉండే అంశాలు. విద్యారవిశంకర్‌ అనే బ్లాగర్‌.. సరిగ్గా అదే చేశారు. ఆమె ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లా పర్యటనకు వెళ్లారు. అక్కడ తిరుగుతూ స్థానిక గిరిజనులు అత్యంత ఇష్టంగా తినే చట్నీని రుచి చూశారు.

నిజానికి ప్రకృతి అందాల నెలవైన బస్తర్‌కు ఆమె వెళ్లింది అక్కడి జలపాతాలు, అందమైన అడవులు చూడటానికి. కానీ.. ఆమె అంతకు మించిన అద్భుతమైన అనుభవాలను మూటగట్టుకుని మరీ తిరుగుపయనమయ్యారు. ఆ అద్భుత అనుభవం మరేమీకాదు.. ఎర్రచీమల చట్నీ! స్థానిక గిరిజనులు ఎలా తయారు చేస్తారో తెలుసుకుని ఆమె ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. చీమలను ఎలా సేకరించాలి? వాటన్నింటినీ చిక్కటి పేస్ట్‌లో ఎలా నూరుకోవాలి? అనే విషయాలు పంచుకున్నారు.

‘పందెకాసి మరీ చెబుతున్నా! ఇంతకంటే అపూర్వమైన అనుభవం ఎవరికీ ఉండదేమో! బస్తర్‌ జనాభాలో 70శాతానికిపైగా వివిధ తెగల గిరిజనులే. వాళ్ల జీవితాల మన పరుగులు తీసే నగర వాసుల వంటివి కాదు. బస్తర్‌ పర్యటన సందర్భంగా స్థానిక గిరిజనులతో కలిసి ఉండేందుకు నాకు అవకాశం కలిగింది. ఈ ట్రిప్‌ను @unexploredbastar, @kangervalley ఏర్పాటు చేశాయి.

ఆ గిరిజనుల కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు ఎంతో ఆధునికంగా ఉన్నాయి. అలాంటివి నేను చూడలేదు. నమ్మలేక పోయాను. కనీసం ఒక్కసారైనా బస్తర్‌ టూర్‌కు ప్లాన్‌ చేసుకోండి. అనేక రకాలుగా అది మన కళ్లు తెరిపిస్తుంది. నమ్మండి.. మీరు నిజంగా ఇష్టపడతారు’ అని ఆమె వీడియోలో చెప్పారు.