న‌వంబ‌ర్ 15 నాటికి ప్ర‌పంచ జ‌నాభా 800 కోట్లు.. ఐరాస అంచ‌నా

World Population | ప్ర‌పంచ జ‌నాభా పెరిగిపోతూనే ఉంది. న‌వంబ‌ర్ 15వ తేదీ నాటికి ప్ర‌పంచ జ‌నాభా 800 కోట్ల‌కు చేరుకుంటుంద‌ని ఐక్య‌రాజ్య స‌మితి అంచనా వేసింది. 2023లో ప్ర‌పంచంలో అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన దేశంగా భార‌త్ అవ‌త‌రించ‌నుంద‌ని నివేదిక‌లో పేర్కొంది. అంటే చైనాను భార‌త్ మించిపోనుంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా వచ్చే ఏడాది భారత్ రికార్డులకెక్కబోతోంది. ఈ ఏడాది జులై 11న ప్ర‌పంచ జ‌నాభా దినోత్స‌వం సంద‌ర్భంగా ఐక్య‌రాజ్య స‌మితి విడుద‌ల చేసిన […]

న‌వంబ‌ర్ 15 నాటికి ప్ర‌పంచ జ‌నాభా 800 కోట్లు.. ఐరాస అంచ‌నా

World Population | ప్ర‌పంచ జ‌నాభా పెరిగిపోతూనే ఉంది. న‌వంబ‌ర్ 15వ తేదీ నాటికి ప్ర‌పంచ జ‌నాభా 800 కోట్ల‌కు చేరుకుంటుంద‌ని ఐక్య‌రాజ్య స‌మితి అంచనా వేసింది. 2023లో ప్ర‌పంచంలో అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన దేశంగా భార‌త్ అవ‌త‌రించ‌నుంద‌ని నివేదిక‌లో పేర్కొంది. అంటే చైనాను భార‌త్ మించిపోనుంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా వచ్చే ఏడాది భారత్ రికార్డులకెక్కబోతోంది. ఈ ఏడాది జులై 11న ప్ర‌పంచ జ‌నాభా దినోత్స‌వం సంద‌ర్భంగా ఐక్య‌రాజ్య స‌మితి విడుద‌ల చేసిన జాబితాలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

న‌వంబ‌ర్ 15వ తేదీ నాటికి వ‌ర‌ల్డ్ పాపులేష‌న్ 8 బిలియ‌న్ల‌కు చేరుకుంటుంద‌ని నాడు గుర్తు చేసిన ఐరాస‌.. మ‌రోసారి తాజాగా గుర్తు చేసింది. ఇక 2030 నాటికి 850 కోట్ల‌కు, 2050 నాటికి 970 కోట్ల‌కు జ‌నాభా చేరుకోనుంద‌ని అంచ‌నా వేసింది. 2080 నాటికి 1040 కోట్ల‌కు చేరుకొని, 2100 నాటికి అదే స్థాయిలో జ‌నాభా ఉంటుంద‌ని పేర్కొంది.

ఈ సంద‌ర్భంగా ఐరాస సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఆంటోనియో గుట్రెస్ మాట్లాడుతూ.. ఈసారి ప్రపంచ జనాభా దినోత్సవం ఓ కీలక మైలురాయి సంవత్సరంగా మారబోతోందని పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రపంచ జనాభా 800 కోట్ల‌కు చేరుకోబోతోందని తెలిపారు. వైవిధ్యాన్ని జరుపుకునేందుకు ఇదో సందర్భమని పేర్కొన్న ఆయన.. అదే సమయంలో భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉందన్న విషయాన్ని ఇది గుర్తు చేస్తుందని వివరించారు.

ఇక 2023లో చైనా జ‌నాభాను భార‌త్ అధిగ‌మించ‌నుంది. భార‌త్‌తో పాటు కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, నైజీరియా, పాకిస్తాన్‌, ఫిలిఫీన్స్, టాంజానియా దేశాల్లో కూడా జ‌నాభా పెరిగిపోనుంది. 2050 నాటికి పెరుగుతుందని అంచనా వేస్తున్న ప్రపంచ జనాభాలో సగం భారత్ సహా పై ఎనిమిది దేశాల్లోనే ఉంటుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఉత్తరాఫ్రికా, పశ్చిమాసియా, ఓషియానాలలో జనాభా పెరుగుదల నెమ్మదిగా ఉండే అవకాశం ఉంది. అయితే, ఈ శతాబ్దం చివరి నాటికి సానుకూలంగా ఉంటుంది. తూర్పు, ఆగ్నేయాసియా, మధ్య, దక్షిణాసియా, లాటిన్ అమెరికా, కరేబియన్, యూరప్, ఉత్తర అమెరికాలలో జనాభా పతాకస్థాయికి చేరుకుని, 2100 నాటికి తగ్గదల కనిపిస్తుంది.