మత్స్య అవతారంలో యాదాద్రి లక్ష్మీనరసింహుడు
యాదగిరిగుట్టలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మో త్సవాలలో భాగంగా మూడవ రోజు బుధవారం మత్స్య అవతారం
శేష వాహనంపై ఊరేగింపు
విధాత : యాదగిరిగుట్టలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మో త్సవాలలో భాగంగా మూడవ రోజు బుధవారం మత్స్య అవతారం అలంకార సేవలో యాదగిరి లక్ష్మీనరసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు. సోమకాసురుడి నుంచి వేదాలను రక్షించేందుకు విష్ణూమూఃర్తి మత్స్య అవతారం దాల్చి సోమకాసురుడిని సంహరించి వేదాలను బ్రహ్మదేవుడికి అందించారు. విశ్వశాంతి, లోకకల్యాణం కోసం పరమాత్మ దాల్చిన మత్స్య అవతారంలో తిరు వీధుల్లో ఊరేగిన నారసింహుడిని దర్శించుకుని భక్తులు, పురజనులు తన్మయులయ్యారు. సాయంత్రం స్వామివారికి శేష వాహన సేవ నిర్వహించారు. శేష వాహనంపై విహరించిన స్వామివారి దర్శించుకుని భక్తజనం పులకించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం వటపత్ర శాయి అలంకార సేవలో, హంసవాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram