యాదాద్రిలో భక్తుల రద్ధీ.. నరసన్న దర్శనానికి తరలొచ్చిన భక్త జనం

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం భక్తుల రద్ధీతో కిటకిటలాడింది. సెలవు దినం కావడంతో వేలాదిగా తరలివచ్చిన భక్తుల

Reported by: Subbu | ఆధ్యాత్మికం | Apr 14, 2024, 7:26 pm IST
Read Time: 2 mins
యాదాద్రిలో భక్తుల రద్ధీ.. నరసన్న దర్శనానికి తరలొచ్చిన భక్త జనం

విధాత : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం భక్తుల రద్ధీతో కిటకిటలాడింది. సెలవు దినం కావడంతో వేలాదిగా తరలివచ్చిన భక్తుల రద్ధీతో కొండ పరిసరాలు, కొండపైన ఆలయ ప్రాంగణం, మాఢ వీధులు భక్తుల రద్ధీతో సందడిగా కనిపించాయి. కొండ దిగువన పుష్కరణి, కల్యాణ కట్ట వద్ద, కొండపైన క్యూలైన్లలో భక్తులు కిక్కిరిరిశారు. క్యూలైన్లలో వేచివున్న భక్తులకు స్వామివారి దర్శనం కోసం మూడు గంటల సమయం పట్టింది. ప్రత్యేక దర్శనం కోసం గంట సమయం పట్టింది. వేసవి నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం తాగునీరు, మజ్జీగలు సరఫరా చేసింది.