విధాత: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం 21 రోజుల హుండి ఆదాయం 1కోటి 83లక్షల 39,667 రూపాయలుగా వచ్చినట్లుగా ఈవో గీత తెలిపారు.
మంగళవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో మిశ్రమ బంగారం కిలో 128 గ్రాములు, మిశ్రమ వెండి కిలో 3.2 గ్రాములు రాగా విదేశీ నగదు అమెరికా – 2079 డాలర్లు, యూఏఈ – 25 దిరామ్స్, ఆస్ట్రేలియా -240 డాలర్స్, కెనడా -140 డాలర్స్, ఒమాన్ -5 1/2 రియాల్, మలేషియా -50 రింగిట్సు, కువైట్ -20 దినార్స్
న్యూ జిలాండ్ -90 డాలర్స్, బెహరైన్ -1/2 దినార్స్, సూడాన్ -5 పౌండ్స్, క్వార్టర్ -22 రియాల్స్వ చ్చినట్లు తెలిపారు.