Kesineni Nani | నాకు నువ్వు.. నీకు నేను.. కేశినేనికి వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ ప్రశంసలు

ఒళ్ళు మంటెక్కిపోతున్న చంద్రబాబు విధాత‌: కేశినేని నాని (Kesineni Nani).. ఆంధ్రాలో డీటెయిల్స్ అక్కచెప్పక్కర్లేని.. ఇంట్రడక్షన్ అక్కర్లేని నాయకుడు. టీడీపీ తరఫున విజయవాడ ఎంపీగా గెలిచి రాష్ట్రం నడిబొడ్డున అడ్డా వేసుకుని చంద్రబాబుకు కునుకు లేకుండా నిత్యం జోరీగలా పోరుపెడుతున్న నాని అంటే కొందరికి ఇష్టం. బాబు అనుచరులు చాలామందికి ఆయనతో కష్టం. సిట్టింగ్ ఐన తనను కాదని తన తమ్ముడు చిన్నిని తీసుకొచ్చి విజయవాడలో పెద్దరికం ఇవ్వడం, నిత్యం బోండా ఉమా, బుద్ధా వెంకన్న. దేవినేని […]

  • Publish Date - May 23, 2023 / 08:11 AM IST
  • ఒళ్ళు మంటెక్కిపోతున్న చంద్రబాబు

విధాత‌: కేశినేని నాని (Kesineni Nani).. ఆంధ్రాలో డీటెయిల్స్ అక్కచెప్పక్కర్లేని.. ఇంట్రడక్షన్ అక్కర్లేని నాయకుడు. టీడీపీ తరఫున విజయవాడ ఎంపీగా గెలిచి రాష్ట్రం నడిబొడ్డున అడ్డా వేసుకుని చంద్రబాబుకు కునుకు లేకుండా నిత్యం జోరీగలా పోరుపెడుతున్న నాని అంటే కొందరికి ఇష్టం. బాబు అనుచరులు చాలామందికి ఆయనతో కష్టం. సిట్టింగ్ ఐన తనను కాదని తన తమ్ముడు చిన్నిని తీసుకొచ్చి విజయవాడలో పెద్దరికం ఇవ్వడం, నిత్యం బోండా ఉమా, బుద్ధా వెంకన్న. దేవినేని ఉమా వంటివాళ్లతో తన మీద మాటల దాడి చేయడం, ఇదంతా నానికి నచ్చడం లేదు.

అన్నిటికి మించి ఉన్నదున్నట్లు మాట్లాడడం, తన కెరీర్, స్థానం కాపాడుకునేందుకు నిత్యం చంద్రబాబు భజన చేయకపోవడం వంటి నానిలోని ముక్కుసూటితనం చంద్రబాబుకు నచ్చడం లేదు. అందుకే ఆయన్ను పక్కనబెట్టి చిన్నితో పాలిటిక్స్ చేయించాలని చూస్తున్నారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో ఆయనకే టికెట్ ఇస్తారని ఫీలర్లు కూడా వదులుతున్నారు.

ఇదిలా ఉండగానే నిన్న ఓ సభలో నాని, తన పక్కనే కూర్చున్న నందిగామ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావును ప్రశంసలతో ముంచెత్తారు. ప్రజల కోసం బాగా పని చేస్తున్నారని అన్నారు. ఒకే ఎంపీ నియోజకవర్గంలో ఉన్నవాళ్ళం.. కలిసి కూర్చుంటే తప్పా? కలిసి మాట్లాడితే తప్పా.. అయన బాగా పని చేస్తున్నారు కాబట్టి మెచ్చుకున్నాను.. ఇందులో తప్పేముంది అని నాని చేసిన కామెంట్స్ చంద్రబాబు గ్రూపును మరింత కెలికేశాయి.

దానికి రెండో పార్టీ అన్నట్లు గా తాజాగా ఇటునుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు సైతం ఇట్నుంచి మళ్ళొకసారి యార్కర్ వేశారు .. నాని బాగా పని చేస్తున్నారు..ఆయన్ను నేను కలిస్తే తప్పేముంది. ఇదెక్కడి ఘోరం.. వేర్వేరు పార్టీలు ఐనంతమాత్రాన కత్తులు దూసుకోవాలా అని అయన వేసిన ప్రశ్నలకు చంద్రబాబు అండ్ పార్టీ దగ్గర సమాధానాలు లేకపోయాయి.

మొత్తానికి ఇన్నాళ్లుగా చంద్రబాబును ఒక మోస్తరు ర్యాగింగ్ చేసిన నాని ఇప్పుడు దాని డోస్ పెంచినట్లు ఉంది.. నేరుగా వైరిపక్ష ఎమ్మెల్యేలను కొనియాడడం ద్వారా బాబులో బీపీ రేకెత్తిస్తున్నారు.. ఎన్నికలు దగ్గరకు వస్తున్నా తరుణంలో అయన నెక్స్ట్ ఎం చేస్తారన్నది తెలియడం లేదు.. ప్రస్తుతానికి ఐతే ఆయన చంద్రబాబుతో టామ్ అండ్ జెర్రీ మాదిరిగా చెలగాటం ఆడుతున్నారు.