Screen Time | మీ పిల్లలు స్క్రీన్ ఎలా చూస్తున్నారు.. గమనిస్తున్నారా!
పిల్లలు ఎంతసేపు స్క్రీన్ చూస్తున్నారు? ఎక్కువ స్క్రీన్ టైమ్ పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతుందో నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ డిజిటల్ యుగంలో ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలు ఇలా రకరకాలా ఎలక్ట్రానిక్ పరికరాలు నిత్యం మనల్ని అతలాకుతలం చేసేస్తున్నాయి.. గతంలో ఏదైనా అవసరానికి మాత్రమే స్క్రీన్లు చూసే వాళ్లం కానీ.. స్మార్ట్ ఫోన్ ల యుగం మొదలైనప్పటి నుంచి స్క్రీన్‌ను చూసే సమయం రోజు రోజుకు పెరుగుతుందే తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. భవిష్యత్తులో ఫోన్లు, కంప్యూటర్లే మనల్ని నియంత్రించే పరిస్థితులు వస్తాయనడంలో సందేహం లేకుండా పోతోంది.
ఇదిలా ఉంటే పెద్దలు మాత్రమే కాదు, పిల్లలు సైతం వీటి భారిన పడి ఆరోగ్య సమస్యల పాలవుతున్నారు. ప్రస్తుత కాలంలో ఎల్కేజీ చదివే విద్యార్థుల నుంచి రిటైర్ అయ్యి రిలాక్స్ అయ్యే పెద్దవారి వరకు నిత్యం స్క్రీన్ చూడకుంటే రోజు గడిచే పరిస్థితి లేకుండా పోతోంది.
పెద్దల విషయాన్ని వదిలేస్తే.. పిల్లలు ఎంత సేపు స్క్రీన్ చూస్తే బెటర్.. స్క్రీన్ ఎలా చూడాలని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం.. ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులతో హోం వర్క్ అని.. ఆన్లైన్ క్లాస్ అని చెబుతుండటంతో స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలో వారికున్న రకరకాల పనుల్లో పడి పిల్లలు వాటిని ఏ విధంగా వాడుతున్నారు. ఎంత సేపు వాడుతున్నారని తెలుసుకోవడం లేదు. స్క్రీన్ ఎక్కువ సేపు చూసే పిల్లల్లో ఏకాగ్రత లోపిస్తుందని, హైపర్ యాక్టివిటితో బాధపడుతున్నారని.. అలాగే సోషల్ ఇంటరాక్షన్‌లో వెనకబడుతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది.
ఆన్‌లైన్ తరగతులు, ఆన్‌లైన్ గేమింగ్స్ కారణంగా పిల్లలు ఎక్కువ సమయం స్క్రీన్ చూడటం మూలంగా పిల్లల్లో ప్రతికూల శక్తి ఏర్పడుతున్నట్లు నిపుణులు వెల్లడిస్తున్నారు. దీన్ని క్వారెంటైన్ మయోపియా అని అంటున్నారు. చాలా మంది పిల్లలు ఫోన్లలోనూ, ట్యాబ్స్‌ను, టీవీల స్క్రీన్ లను రెండు ఫీట్లకంటే తక్కువ దూరంతో చూస్తున్నారు. ఈ రకంగా స్క్రీన్ చూడటం మూలంగా వారి కంటి చూపుపై తీవ్రమైన ప్రభావం పడుతుంది.
ఇదిలా ఉంటే.. మరోవైపు గంటల కొద్ది స్క్రీన్‌కు అతుక్కుపోవడంతో.. అవుట్ డోర్ గేమ్స్‌కు దూరమైతున్నారు. దీంతో ఉబకాయం వంటి సమస్యలతో పాటు, శరీర ధృఢత్వాన్నికోల్పోతున్నారు. అయితే పిల్లలు స్క్రీన్ వినియోగించుకునే విధానంలో 3-6-9-12నిబంధన పాటించడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు.
మూడేళ్లు దాటేంత వరకు పిల్లలకు అసలు స్క్రీన్ సమయమే ఉండకూడదు. ఈ వయసులో వారికి కావాల్సింది సెన్సరీ యాక్టివిటీలు, కుటుంబ సభ్యులతో తిరగడం, పర్యావరణ పరిచయం వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి.
మూడు నుంచి ఆరేళ్ల పిల్లలకు డిజిటల్ పరికరాలు అందిస్తే.. రోజులో 30 నిమిషాలు మించకుండా చూసుకోవాలి. అది కూడా తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే వాటిని ఇవ్వాలి. ఈ సమయంలో ఆన్‌లైన్ ఆటల జోలికి పోకుండా చూసుకోవాలి. బయట ఆటలు ఆడుకునేందుకు ఎక్కువగా ప్రోత్సహించాలి.
ఆరు నుంచి తొమ్మిదేళ్లలోపు పిల్లలకు ఒంటరిగా ఫోన్లు, ట్యాబ్స్, కంప్యూటర్లు ఉపయోగించే అవకాశం ఇవ్వకూడదు. ప్రాజెక్టులు, ఆన్‌లైన క్లాసులు వంటి అవసరమైన పనులకే తప్ప.. మిగతా వేటికి ఇంటర్నెట్ వాడకుండా జాగ్రత్తపడాలి. ఒక వేళ బ్రౌజ్ చేయాల్సి వస్తే నమ్మకమైన వెబ్‌సైట్లు మాత్రమే యాక్సెస్ అయ్యేలా చూసుకోవాలి.
పన్నెండేళ్లు, ఆ తర్వాత ఆలోచనలు, అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు అభివృద్ధి చెందే దశ ఇది. ఈ దశలోనే పిల్లలు సోషల్ మీడియాను విరివిగా వినియోగిస్తున్నారు. చెడుసావాసాలు, సైబర్, ఆర్థిక మోసాల బారిన పడుతున్నారు. అందుకే మంచి చెడుల వత్యాసం తెలిసే వరకు వీలైన మేర పిల్లలు సామాజిక మాద్యమాలకు దూరంగా ఉండేలా చూసుకోవడం మేలని నిపుణులు అంటున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram