Life style | మగవాళ్లలో ఆ శక్తిని పెంచే ఈ ఫుడ్ ఐటమ్స్ గురించి మీకు తెలుసా..?
Life style | శృంగారంలో తొందరపాటు అంత మంచిది కాదు. చాలా సహనం ఉండాలి. అందుకు ధృడమైన మనస్తత్వం కావాలి. ఇవి సాధనతో ప్రయత్నిస్తే ఎవరికైనా సాధ్యపడేవే. అయితే మానసిక ధృడత్వానికి తోడు శారీరక ధృడత్వం కూడా శృంగారానికి చాలా అవసరం. కొన్ని రకాల ఆహార పదార్థాల్లో శారీరక ధృడత్వాన్ని పెంచే సామర్థ్యం ఉంది. మరి శారీరక ధృడత్వాన్ని పెంచే ఆ పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

Life style : శృంగారం అనేది సృష్టి కార్యం..! సృష్టి కార్యం మాత్రమే కాదు ఒక అద్భుతమైన కావ్యం కూడా..! ఎందుకంటే సాహితీవేత్త రాసిన కావ్యంలోలాగే శృంగారంలో కూడా లెక్కలేనన్ని పేజీలు ఉంటాయి..! ఆ పేజీలన్నింటినీ చదివి ఆస్వాదించడానికి జీవితకాలం కూడా సరిపోదు..! ఒక్కో పేజీకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది..! ఎంత చదివినా ఇంకా కొత్తగానే అనిపించడం ఈ శృంగార కావ్యం గొప్పతనం..! అంతేగాక, శృంగారం ఒక మహత్తరమైన క్రీడ కూడా..! అయితే, ఈ క్రీడలో ఆతృత, ఆరాటం పనికిరాదు..! తొందరపడిన వాళ్లు నీరుగారడం, ఓపిక పట్టినవాళ్లు విజేతలుగా నిలవడం ఈ క్రీడ ప్రత్యేకత..!
అందుకే సమరంలో కంటే సరసంలోనే సహనం చాలా ముఖ్యమని వాత్సాయనుడు అనాడే సెలవిచ్చాడు. అందుకే శృంగారంలో తొందరపాటు అంత మంచిది కాదు. చాలా సహనం ఉండాలి. అందుకు ధృడమైన మనస్తత్వం కావాలి. ఇవి సాధనతో ప్రయత్నిస్తే ఎవరికైనా సాధ్యపడేవే. అయితే మానసిక ధృడత్వానికి తోడు శారీరక ధృడత్వం కూడా శృంగారానికి చాలా అవసరం. కొన్ని రకాల ఆహార పదార్థాల్లో శారీరక ధృడత్వాన్ని పెంచే సామర్థ్యం ఉంది. మరి శారీరక ధృడత్వాన్ని పెంచే ఆ పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
అల్లం
అల్లం టీ తాగితే శరీరంలో ఒక కొత్తశక్తి వచ్చినట్లు అనిపిస్తుంది. అందుకే వంటల్లో అల్లం ఉపయోగిస్తుంటారు. ఈ అల్లంవల్ల శక్తి మాత్రమే కాదు, వంటలకు రుచి కూడా వస్తుంది. రోజూ చెంచాడు అల్లం రసం తీసుకుంటే వీర్య వృద్ధి జరిగి సంతానలేమీ సమస్యలు కూడా తొలగిపోతాయట.
ఇంగువ-బెల్లం
ప్రతిరోజూ ఇంగువతోపాటు బెల్లాన్ని ఆహారంలో భాగం చేసుకోవడంవల్ల పురుషుల్లో సామర్థ్యం పెరుగుతుందట. శృంగార సమస్యలతోపాటే ఇతర అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయట.
వెల్లుల్లి
వెల్లుల్లిలో కూడా శృంగార సామర్థ్యాన్ని పెంచే లక్షణం ఉందట. శృంగారంలో ఊరికెనే తేలిపోయే పురుషులకు ఈ వెల్లుల్లి దివ్యమైన ఔషధంలా పనిచేస్తుందట. నిత్యం వంటల్లో వాడటంతోపాటు అప్పుడప్పుడు పచ్చి వెల్లుల్లి రెబ్బలు కూడా తినడంవల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుందట.
మునక్కాయలు
మునక్కాయలు తింటే మగాడిలో మగసిరి మీసం మెలేస్తుందట. మునక్కాయల్లో ఉండే జింక్ లైంగిక సామర్థ్యం పెరగడంలో తోడ్పడుతుందట. అదేవిధంగా మునక్కాయల్లో కాల్షియం, ఐరన్ కూడా ఉండటంవల్ల ఎముకల ధృడత్వానికి తోడ్పడుతాయట.
సోంపు
సోంపును సాధారణంగా జీర్ణశక్తిని పెంచుకోవడం కోసం ఉపయోగిస్తుంటాం. అందుకే భోజనం చేసిన తర్వాత నోట్లో సోంపు వేసుకోవడం చాలామందికి అలవాటు. అయితే, జీర్ణశక్తిని పెంచే ఈ సోంపే శృంగార సామర్థ్యాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుందట. రోజుకి రెండు సార్లు చెంచాడు సోంపు నోట్లో వేసుకుంటే పురుషుల్లో సామర్థ్యం పెరగడమేగాక, అంగస్తంభన సమస్య కూడా తొలిగిపోతుందట.
ఇవి కూడా చదవండి
శృంగారం పూర్తవగానే ఈ పనులు అస్సలు చేయవద్దు.. అవేంటో తెలుసా..?
ఆ పనిలో సొంత ప్రయోగాలు చేయకండి.. మొదటికే మోసం తెలుసా..!
శృంగార సామర్థ్యం ఉన్నప్పటికీ కోరిక సన్నగిల్లిందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
క్రమం తప్పని శృంగారంతో అన్నీ లాభాలే.. అవేంటో తెలుసా..?
పురుషుల్లో అంగం సైజు క్రమంగా తగ్గుతోందా.. చైనా నిర్వాకమే కారణమా..?