Life style | శృంగారం పూర్తవగానే ఈ పనులు అస్సలు చేయవద్దు.. అవేంటో తెలుసా..?
Life style | శృంగారం అనేది ఒక మధురమైన భావన. భార్య, భర్తల మధ్య బంధాన్ని బలోపేతం చేయడంతో శృంగారానికి కీలకమైన పాత్ర. ఈ శారీరక కలయిక ఇద్దరి మధ్య విడదీయరాని మానసిక బంధాన్ని ఏర్పరుస్తుంది. అయితే ఇంతటి పవిత్రమైన శృంగార కార్యం పూర్తయిన తర్వాత చేయాల్సిన, చేయకూడని పనులు కొన్ని ఉన్నాయని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. మరి చేయకూడని పనులేమిటో, చేయాల్సిన పనులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

Life style : శృంగారం అనేది ఒక మధురమైన భావన. భార్య, భర్తల మధ్య బంధాన్ని బలోపేతం చేయడంతో శృంగారానికి కీలకమైన పాత్ర. ఈ శారీరక కలయిక ఇద్దరి మధ్య విడదీయరాని మానసిక బంధాన్ని ఏర్పరుస్తుంది. అయితే ఇంతటి పవిత్రమైన శృంగార కార్యం పూర్తయిన తర్వాత చేయాల్సిన, చేయకూడని పనులు కొన్ని ఉన్నాయని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. మరి చేయకూడని పనులేమిటో, చేయాల్సిన పనులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
సబ్బుతో కడగవద్దు
సంభోగం తర్వాత స్త్రీలు తమ జననేంద్రియ ప్రాంతాన్ని సబ్బుతో అస్సలే కడగవద్దు. స్త్రీలు ఇలా చేయడంవల్ల ఆ ప్రాంతంలో వాపు, పొడిబారడం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది శృంగారం పూర్తయిన వెంటనే బాత్రూమ్‌కి వెళ్లి శుభ్రం చేసుకుంటారు. అయితే ఇది మంచిది కాదు. కానీ శృంగారం తర్వాత ఓ అరగంట ఆగి ఆ పార్టును శుభ్రం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
వెంటనే మూత్ర విసర్జన చేయొద్దు
శృంగారం తర్వాత వెంటనే మూత్ర విసర్జన చేయవద్దు. శృంగారం అయిపోగానే కనీసం 15 నుంచి 20 నిమిషాల తర్వాత మాత్రమే మూత్ర విసర్జన చేయాలి. అదేవిధంగా శృంగారం తర్వాత మూత్ర విసర్జన చేయకపోవడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. చాలామంది మహిళలు శృంగారం తర్వాత మూత్ర విసర్జనకు దూరంగా ఉంటారు. ఇలా మూత్రవిసర్జన చేయకపోవడంవల్ల ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.
చేతులు కడగడం మరువద్దు
శృంగారం సమయంలో స్త్రీ పురుషులిద్దరూ ఒకరి జననాంగాలను ఒకరు తాకడం సహజం. కాబట్టి కలయిక పూర్తవగానే తప్పకుండా చేతులు కడుక్కోవాలి. లేదంటే చాలామందిలో బాక్టీరియా, ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌లు వచ్చే అవకాశం ఉంది.
వెంటనే స్నానం వద్దు
శృంగారం పూర్తయిన వెంటనే స్నానం చేయడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇంకా కొంతమంది అయితే వేడి నీటితో స్నానం చేస్తారు. ఇలా వేడి నీటితో స్నానం చేయడం ఇంకా అనర్థమని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే శృంగారం తర్వాత స్త్రీ రహస్య భాగంలో కండరాలు సడలి ఉంటాయి. అలాంటప్పుడు వేడి నీటి వేడి నీటి స్నానాలు ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తాయి. అయితే కొంతసేపు ఆగిన తర్వాత స్నానం చేసుకోవచ్చు.
నీరు తాగాలి
శృంగారం తర్వాత దంపతులిద్దరూ బాగా అలసిపోతారు. చెమట రూపంలో ఒంట్లోని నీరు అంతా వెళ్లిపోతుంది. కాబట్టి కలయిక తర్వాత ఒకటి లేదా రెండు గ్లాసుల నీళ్లు తాగాలి. దాంతో శరీరాలు తిరిగి హైడ్రేట్ అవుతాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
బిగుతు దుస్తులు వద్దు
కొంతమంది శృంగారం తర్వాత బిగుతుగా ఉండే దుస్తులు వేసుకుంటారు. కానీ ఆ సమయంలో బిగుతుగా ఉండే బట్టలు అస్సలు ధరించకూడదు. బిగుతు దుస్తులు ధరించడం వల్ల ఇన్‌ఫెక్షన్లు, దురదలు లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి శృంగారం తర్వాత తేలికపాటి కాటన్ దుస్తులు ధరించడం మంచిది.
వెంటనే నిద్రవద్దు
శృంగారం తర్వాత వెంటనే నిద్రపోవద్దు. కనీసం ఒక 30 నిమిషాలపాటు బెడ్‌పైనే మెలుకువగా ఉండి విశ్రాంతి తీసుకోవడం మంచిది. శృంగారం సమయంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. కాబట్టి అరగంట విశ్రాంతి తీసుకుంటే శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఆ తర్వాత కావాలంటే నిద్రపోవచ్చు.
ఇవి కూడా చదవండి
మగవాళ్లలో ఆ శక్తిని పెంచే ఈ ఫుడ్ ఐటమ్స్ గురించి మీకు తెలుసా..?
ఆ పనిలో సొంత ప్రయోగాలు చేయకండి.. మొదటికే మోసం తెలుసా..!
శృంగార సామర్థ్యం ఉన్నప్పటికీ కోరిక సన్నగిల్లిందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
క్రమం తప్పని శృంగారంతో అన్నీ లాభాలే.. అవేంటో తెలుసా..?
పురుషుల్లో అంగం సైజు క్రమంగా తగ్గుతోందా.. చైనా నిర్వాకమే కారణమా..?