Food Items in Refrigerator | వీటిని ఫ్రిజ్‌లో అస‌లు ఉంచొద్దు.. బ‌య‌ట ఉంచితేనే ఆరోగ్యానికి శ్రేయ‌స్క‌రం..!

Food Items in Refrigerator | ప్ర‌స్తుత కాలంలో ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లో ఫ్రిజ్( Refrigerator  )ఉంది. పిల్ల‌లు తినే చాక్లెట్స్ నుంచి మొద‌లుకుంటే.. ఆకుకూర‌లు, కూర‌గాయ‌లు( Vegetables ), ఇత‌ర ఆహార ప‌దార్థాల‌తో( Food Items )ఫ్రిజ్ ఖాళీ లేకుండా నింపేస్తాం. ఇలా చేయ‌డం అస‌లు మంచిది కాద‌ని ఆరోగ్య నిపుణులు( Health Experts ) హెచ్చ‌రిస్తున్నారు. ఈ ఆహార ప‌దార్థాల‌ను అస‌లు ఫ్రిజ్‌లో ఉంచ‌కూడ‌ద‌ని సూచిస్తున్నారు.

  • By: raj |    health-news |    Published on : Nov 08, 2025 8:00 AM IST
Food Items in Refrigerator | వీటిని ఫ్రిజ్‌లో అస‌లు ఉంచొద్దు.. బ‌య‌ట ఉంచితేనే ఆరోగ్యానికి శ్రేయ‌స్క‌రం..!

Food Items in Refrigerator | ప్ర‌తి ఇక్క‌రి ఇంట్లో ఉన్న ఫ్రిజ్‌( Refrigerator  )లో ఆకుకూరలు, కూర‌గాయ‌లు( Vegetables ) మాత్ర‌మే పెట్ట‌రు. అందులో దోస పిండి, ఇడ్లీ పిండి, మిగిలిపోయిన కూర‌లు.. ఇలా ఒక్క‌టేమిటి..? అనేక ఆహార ప‌దార్థాల‌తో( Food Items ) ఫ్రిజ్ నిండిపోయి ఉంటుంది. ఫ్రిజ్‌లో ఏది ప‌డితే అది పెట్ట‌డం మంచిది కాద‌నే విష‌యం చాలా మందికి తెలియ‌దు. కొన్ని ఆహార ప‌దార్థాల‌ను ఫ్రిజ్‌లో పెట్ట‌కుండా గ‌ది ఉష్ణోగ్ర‌త‌లో బ‌య‌ట ఉంచితేనే ఆరోగ్యానికి శ్రేయ‌స్క‌రం అని ఆరోగ్య నిపుణులు( health Experts ) సూచిస్తున్నారు. మ‌రి ఫ్రిజ్‌లో పెట్ట‌కూడని ఆహార ప‌దార్థాలు ఏవో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం..

ఫ్రిజ్‌లో పెట్ట‌కూడ‌ని ఆహార ప‌దార్థాలు ఇవే..

  • వంట నూనెల్ని కొంద‌రు ఫ్రిజ్‌లో ఉంచుతుంటారు. శాచురేటెడ్ కొవ్వులున్న నూనెల‌ను అత్యంత చ‌ల్ల‌టి ప్ర‌దేశంలో ఉంచాల్సిన అవ‌స‌రం లేదు.
  • కెచ‌ప్‌లు, సాస్‌లలో కూడా ప్రిజ‌ర్వేటివ్స్ వాడుతున్నారు కాబ‌ట్టి వీటిని ఫ్రిజ్‌లో ఉంచాల్సిన అవ‌స‌రం లేదు.
  • ఆరెంజ్‌తో పాటు నిమ్మ‌కాయ‌ల‌ను కూడా ఫ్రిజ్‌లో పెట్ట‌కూడ‌దు.
  • స‌పోటా, జామ‌, ఆపిల్స్, అర‌టి పండ్లు, క‌ర్జూరం, పులుపు పండ్లు.. వీటిలో టెక్చ‌ర్ అధికంగా ఉంటుంది. కాబ‌ట్టి వీటిని ఫ్రిజ్‌లో ఉంచ‌డం కార‌ణంగా టెక్చ‌ర్ దెబ్బ‌తింటుంది. ఫ్లేవ‌ర్ కూడా పోతుంది.
  • పిల్ల‌లు ఎక్కువ‌గా తినే బ్రెడ్, జామ్‌లు సైతం ఫ్రిజ్‌లో ఉంచుతుంటారు. ఇలా చేయ‌డం మూలంగా బ్రెడ్‌లోని జిగురు, తేమ పోతాయి. స్ల‌యిసెస్ పిండి పిండిగా మారుతాయి. బ్రెడ్‌లోని జిగురు పోతే తిన‌డానికి సులువుగా ఉండ‌దు.
  • తేనేను ఫ్రిజ్‌లో ఉంచితే గ‌ట్టిప‌డే అవ‌కాశం ఉంది. ఇందులోని షుగ‌ర్ కంటెంట్ స్పటికాలుగా కూడా మారుతుంది. కాబ‌ట్టి బ‌య‌ట ఉంచితేనే మంచిద‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.