Antibacterial Products | మీరు యాంటిబాక్టీరియల్‌ సబ్బులు, వైప్స్‌ వాడుతుంటారా? అయితే.. ఈ వార్త మీకోసమే

రోజూ వాడే యాంటిబ్యాక్టీరియల్ సబ్బులు, స్ప్రేలు ఆరోగ్యానికి అదనంగా లాభం చేకూర్చకపోగా.. ప్రమాదాన్ని పెంచుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. AMR ఎలా పెరుగుతోంది? పూర్తి వివరాలు చదవండి.

Reported by: Jagan Mohan Talluri | జీవనశైలి | Mar 31, 2026, 7:57 pm IST
Read Time: 5 mins
Antibacterial Products | మీరు యాంటిబాక్టీరియల్‌ సబ్బులు, వైప్స్‌ వాడుతుంటారా? అయితే.. ఈ వార్త మీకోసమే

Antibacterial Products |  శుభ్రత కోసం కొంతమంది యాంటిబాక్టీరియల్‌ సోప్స్‌, వైప్స్‌, స్ప్రేలు, ఇతర జర్మ్‌ కిల్లింగ్‌ ప్రొడక్ట్స్‌ వాడుతూ ఉంటారు. అయితే.. ఇది ఎక్కు మందికి ఏ మాత్రం మేలు చేయకపోగా.. ప్రపంచవ్యాప్తంగా యాంటిమైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌కు దోహదం చేస్తున్నదని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం హెచ్చరిస్తున్నది. ఇప్పటికే యాంటిబయాటిక్‌కి ప్రతిఘటన చూపే ఇన్ఫెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా ఏటా పది లక్షలకు పైగా మరణాలకు కారణమవుతున్నట్టు ఐక్య రాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం వెల్లడించింది. 2025 నాటికి ఈ సమస్య క్యాన్సర్‌కు సమానంగా ప్రధాన మరణ కారణాల్లో ఒకటిగా ముందుకు వస్తుందన్న అంచనాలున్నాయి.

ఇప్పటి వరకూ యాంటిమైక్రోబియల్‌ రిసిస్టెన్స్‌కు హాస్సిటళ్లలో యాంటిబయోటిక్‌ దుర్వినియోగం, వ్యవసాయ రంగంలో అత్యధికంగా వినియోగించడానికి పరిమితమైంది. కానీ ఇప్పుడు ఇళ్లలో వాడే సాధారణ ఉత్పత్తులు కూడా పెద్ద ప్రమాదంగా పరిణమిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

హైలైట్స్:

  • యాంటిబాక్టీరియల్ ఉత్పత్తుల్లో క్యూఏసీలు (Quaternary Ammonium Compounds), క్లోరాక్సిలెనోల్‌ ఉంటాయి.
  • ఇవి బాక్టీరియాను చంపడమే కాకుండా.. అవి మరింత బలంగా మారేలా చేస్తాయి.
  • అంటే.. వాటికి బాక్టీరియా అలవాటుపడిపోయి.. భవిష్యత్తులో యాంటిబయోటిక్స్‌ పనిచేయకుండాపోయే ప్రమాదం ఉంది.

ప్రతి రోజూ కోట్ల కొద్దీ ఇళ్ల నుంచి ఈ రసాయనాలు డ్రైనేజీ ద్వారా బయటకు వెళతాయి. ఈ మురుగునీరు వివిధ నీటి వ్యవస్థలోకి వెళ్లటం ద్వారా బాక్టీరియా మార్పుల చెందుతుంది. ఫలితంగా బ్యాక్టీరియా రెసిస్టెన్స్‌ పెరుగుతుంది. సూపర్‌ బగ్స్‌ ఉత్పత్తి అవుతాయి. ఈ రసాయన ప్రభావాలతో బ్యాక్టీరియా జీవించడమే కాకుండా.. విస్తరిస్తుంది. యాంటిబయోటిక్స్‌కు కూడా అది రెసిస్టెంట్‌ అవుతుంది. ఆ బాక్టీరియాలో జన్యుపరమైన మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. పైగా.. బాక్టీరియా మధ్య రెసిస్టెన్స్‌ జీన్స్‌ మార్పిడి జరుగుతుంది.

సాధారణంగా యాంటిబాక్టీరియల్‌ ఉత్పత్తులు ఆరోగ్యపరంగా అదనపు ప్రయోజనం ఏమీ ఇవ్వడం లేదని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే అతి శుభ్రతకు పోయి.. యాంటిబాక్టీరియల్‌ ప్రొడక్ట్స్‌ ఉపయోగించవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్ అండ్‌ ప్రివెన్షన్‌ వంటి సంస్థలు సూచిస్తున్నాయి. సాధారణ సబ్బు ఉపయోగించి, నీటితో చేతులు శుభ్రం చేసుకుంటే సరిపోతుందని పేర్కొంటున్నాయి. అవసరం లేని యాంటిబాక్టీరియల్‌ ప్రొడక్ట్స్‌ను నిషేధించాలని, వీటి విషయంలో ప్రజల్లో అవగాహన పెంచాలని ప్రభుత్వాలకు సూచిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి.. 

AI Data Centers | డాటా సెంటర్లు ‘హీట్‌ ఐలాండ్స్‌’గా మారిపోతున్నాయా? మానవాళికి కొత్త అధ్యయనం హెచ్చరికలు
Bengaluru Techie Couple Suicide : బెంగళూర్ లో టెకీ జంట ఆత్మహత్య
Muzaffarnagar Highway Accident : లక్కీ స్పాట్.. తప్పిన చావు !