IRCTC Saurashtra Tour | రూ.30వేలలోనే ద్వారక-సోమనాథ్ యాత్ర.. ఐఆర్‌సీటీసీ 8 రోజుల ఆధ్యాత్మిక ట్రిప్!

IRCTC Saurashtra Tour | ఉరుకుల పరుగుల జీవితానికి కాస్త బ్రేక్ ఇచ్చి ఆధ్యాత్మిక యాత్ర చేయాలని అనుకుంటున్నారా? గుజరాత్‌లోని ద్వారక, సోమనాథ్ వంటి పవిత్ర క్షేత్రాలను ఒకేసారి దర్శించుకునేలా ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీని తీసుకొచ్చింది.

IRCTC Saurashtra Tour | ఉరుకుల పరుగుల జీవితానికి కాస్త బ్రేక్ ఇచ్చి ఆధ్యాత్మిక యాత్ర చేయాలని అనుకుంటున్నారా? గుజరాత్‌లోని ద్వారక, సోమనాథ్ వంటి పవిత్ర క్షేత్రాలను ఒకేసారి దర్శించుకునేలా ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీని తీసుకొచ్చింది. సుందర్ సౌరాష్ట్ర (Sundar Saurashtra) పేరుతో ఆధ్యాత్మిక ట్రిప్‌ అందుబాటులో ఉంచింది.

ఈ ప్యాకేజీ ద్వారా వడోదర, అహ్మదాబాద్, ద్వారక, సోమనాథ్ వంటి ప్రముఖ ప్రదేశాలను సందర్శిస్తూ 8 రోజుల పాటు ప్రశాంతంగా గడపవచ్చు. ప్రతి బుధవారం నాడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది.

ప్యాకేజీ ధరలు

ఈ సుందర్ సౌరాష్ట్ర ట్రావెల్ ప్యాకేజీలో భాగంగా రెండు కేటగిరీల్లో ఐఆర్‌సీటీసీ టికెట్లను ఆఫర్ చేస్తుంది. కంఫర్ట్ (3AC) విభాగంలో డబుల్ ఆక్యుపెన్సీకి రూ30,640; ట్రిపుల్ షేరింగ్ అయితే రూ.29,960 చార్జి చేస్తుంది. అదే పిల్లలకు బెడ్‌తో కలిపి రూ.21,250; బెడ్ లేకుండా అయితలే రూ.19,690 వసూలు చేస్తుంది.

ఇక స్టాండర్డ్ (స్లీపర్) విభాగంలో డబుల్ ఆక్యుపెన్సీకి రూ27,740; ట్రిపుల్ షేరింగ్ అయితే రూ.27,050 చార్జి చేస్తుంది. అదే పిల్లలకు బెడ్‌తో కలిపి రూ.18,340; బెడ్ లేకుండా అయితే రూ.16,780 వసూలు చేస్తుంది.

రోజువారీ టూర్ షెడ్యూల్ ఇదీ!

మొదటి రోజు: సికింద్రాబాద్ రైల్వే స్టేసన్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్-పోర్‌బందర్ ఎక్స్‌ప్రెస్ ద్వారా బయల్దేరతారు.

రెండో రోజు: ఓవర్‌నైట్ జర్నీ అనంతరం ఉదయం 11 గంటలకు వడోదర చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్‌కు వెళ్లి ఫ్రెషప్ అయిన తర్వాత స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సందర్శించారు. ఈ టికెట్లను ప్రయాణికులే స్వయంగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రాత్రికి వడోదరలోనే బస ఉంటుంది.

మూడో రోజు: ముందుగా లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌ను సందర్శిస్తారు. అనంతరం అహ్మదాబాద్‌కు బయల్దేరతారు. అక్కడ సబర్మతి ఆశ్రమం, అక్షర్‌ధామ్ ఆలయాలను సందర్శస్తారు. రాత్రికి అహ్మదాబాద్‌లోనే బస చేస్తారు.

నాలుగో రోజు: ఉదయమే అహ్మదాబాద్ నుంచి బయల్దేరి ద్వారకకు వెళ్తారు. దారి మధ్యలో జామ్‌నగర్ లక్షోటా ప్యాలెస్, మ్యూజియాన్ని సందర్శిస్తారు. సాయంత్రానికి ద్వారక చేరుకుని, హోటల్‌లో బస చేస్తారు.

ఐదో రోజు: ఉదయం ద్వారకాధీశ ఆలయం సందర్శిస్తారు. అనంతరం బేట్ ద్వారక, నాగేశ్వర ఆలయాలను దర్శించుకుంటారు. రాత్రికి ద్వారకలోనే బస ఉంటుంది.

ఆరో రోజు: ద్వారక నుంచి బయల్దేరి సోమనాథ్ వెళ్తారు. దారిమధ్యలో పోర్‌బందర్‌లో ఆగి కృతి మందిర్, సుధామా ఆలయం దర్శించుకుంటారు. సోమనాథ్ చేరుకుని సోమనాథేశ్వరుడిని దర్శించుకుంటారు. జ్యోతిర్లింగ దర్శనం అనంతరం చుట్టుపక్కల ఉన్న ఆలయాలను సందర్శిస్తారు. సాయంత్రం దాటాక పోర్‌బందర్ బయల్దేరి వెళ్తారు.

ఏడో రోజు: అర్ధరాత్రి 12.50 గంటలకు పోర్‌బందర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

ఎనిమిదో రోజు: ఉదయం 8.20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో ఈ ట్రిప్ ముగుస్తుంది.

ప్యాకేజీలో ఉండే సదుపాయాలు

ప్యాకేజీలో లేని సదుపాయాలు

Read More:

IRCTC Sapta Jyotirlinga Tour | రూ.17వేల్లోనే సప్త జ్యోతిర్లింగాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ఆధ్యాత్మిక టూర్!

IRCTC Vietnam Tour | తక్కువ ఖర్చులో విదేశీ టూర్.. వియత్నాం వైబ్స్ పేరుతో ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీ!

Latest News