TAR-200 Revolutionary Cancer Treatment | క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మైలురాయి.. మూడు నెలల్లోనే రోగం మాయం!
బ్లాడర్ క్యాన్సర్‌తో బాధపడే రోగులకు జాన్సన్ అండ్ జాన్సన్ కొత్త ఆశను కల్పిస్తున్నది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన TAR-200 ఔషధ పరికరం.. కేవలం మూడు నెలల్లోనే క్యాన్సర్ కణాలను అంతమొంచింది. దీనికి అమెరికాలోని ఎఫ్‌డీఏ.. బ్రేక్‌థ్రూ థెరపీ డెసిగ్నేషన్ ఇచ్చింది.
TAR-200 Revolutionary Cancer Treatment | క్యాన్సర్ అంటే ఇక మరణమే శరణ్యమనుకునేవారు ఉన్నారు. దాన్ని మానసిక బలంతో అధిగమించినవారూ ఉన్నారు. అయితే.. క్యాన్సర్ చికిత్సా విధానంలో ఒక కొత్త ఔషధ పరికరం TAR-200.. మూత్రాశయ క్యాన్సర్ (బ్లాడర్ క్యాన్సర్)లో విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతుందన్న ఆశాభావాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం మూడు నెలల వ్యవధిలోనే బ్లాడర్ క్యాన్సర్‌ను రూపుమాపవచ్చని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఔషధ పరికరాన్ని జాన్సన్ అండ్ జాన్సన్ (Johnson & Johnson) అభివృద్ధి చేసింది. బీసీజీ చికిత్సకు స్పందించని హై రిస్క్ నాన్ మసిల్ ఇన్వేసిబ్ బ్లాడర్ క్యాన్సర్ (HR-NMIBC) రోగులకు ఇది మెరుగైన ఫలితాలను అందిస్తున్నదని చెబుతున్నారు. టీఏఆర్–200 (TAR-200) ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ ఫలితాను 2025 జూలైలో జర్నల్ ఆఫ్ క్లినకల్ ఆంకాలజీలో ప్రచురించారు. ఈ ట్రయల్స్‌లో TAR-200ను రోగులపై ఉపయోగించగా.. 82 శాతం మందిలో క్యాన్సర్ కణాలు మూడు నెలల్లోనే పూర్తిగా మాయమైనట్టు నిర్ధారణైంది. వైద్యరంగంలో ప్రత్యేకించి బ్లాడర్ క్యాన్సర్ చికిత్సలో ఇదొక కీలక విజయంగా పరిగణిస్తున్నారు.
Colon Cancer In Young Adults |పేగులలో దాగి ఉన్న ముప్పు
TAR-200 అనేది ఒక చిన్న, ప్రెట్జెల్ ఆకారంలో ఉన్న ఇంట్రావెసికల్ (మూత్రాశయంలోకి ఉపయోగించే) పరికరం ఇది జెమ్‌సిటాబిన్ (gemcitabine) అనే కెమోథెరపీ ఔషధాన్ని నిరంతరాయంగా విడుదల చేస్తూ ఉంటుంది. సాధారణ కెమోథెరపీలో ఔషధాలను కొన్ని గంటలపాటు శరరీంలోకి ఇంజెక్ట్ చేస్తారు. దానితో పోల్చితే టీఏఆర్–200 పరికరం మూడువారాలపాటు మూత్రాశయంలోని క్యాన్సర్ కణితులకు నిరంతరం డోస్‌ను అందిస్తుంది. ఈ పద్ధతి.. శరీరంలోకి సైడ్‌ఎఫెక్ట్స్‌ను తగ్గించి.. క్యాన్సర్ కణాలను టార్గెట్ చేసుకుని, వాటిని అంతమొందిస్తుంది. క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న రోజులకు ఆరు నెలలపాటు ప్రతి మూడువారాలకు ఒకసారి.. ఆ తర్వాత 18 నెలల వరకూ ప్రతి 12 వారాలకు ఒకసారి ఈ చికిత్సను అందించారు. గతంలో బీసీజీ చికిత్సకు స్పందించని, ఇక మూత్రాశయాన్ని తొలగించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్న రోగులను తాజా క్లినికల్ ట్రయల్స్‌కు ఎంచుకున్నారు. TAR-200 ఉపయోగించిన రోగులలో 82 శాతం మందిలో క్యాన్సర్ కణాలు పూర్తిగా మటుమాయం అయ్యాయని ధృవీకరించారు. దీనితోపాటు ఈ రోగులలో సుమారు 50 శాతం మందికి ఏడాది తర్వాత కూడా క్యాన్సర్ లక్షణాలు మళ్లీ కనిపించలేదు.
Russia Cancer Vaccine| క్యాన్సర్ రోగులకు శుభవార్త.. వందశాతం సమర్థతతో వ్యాక్సిన్ రెడీ!
రకరకాల కెమోథెరపీలతో విసిగివేసారిపోయిన, ప్రాణాలపై ఆశ వదులుకున్న రోగులకు ఈ ఔషధ పరికరం ఆశాకిరణంగా వైద్య నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఈ చికిత్సలో ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్స్ చాలా స్వల్ప స్థాయిలోనే ఉండటం గమనార్హం. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఈ ఔషధానికి బ్రేక్‌థ్రూ థెరపీ డెసిగ్నేషన్ (BTD) ఇచ్చింది. జూలై 2025లో ప్రైరిటీ రివ్యూ ప్రక్రియ ప్రారంభించింది. సమీక్షను వేగవంతం చేయడంతో మార్కెట్‌లో TAR-200 అందుబాటులోకి రావడానికి ఎక్కువ సమయం పట్టబోదని ఆశాభావం వ్యక్తమవుతున్నది. ఇదే ఔషధ పరికరాన్ని హెచ్‌ఆర్–ఎన్‌ఎంఐబీసీతోపాటు.. మరిన్ని ఇతర క్యాన్సర్‌లకు విస్తరించే అవకాశాలను జాన్సన్ అండ్ జాన్సన్ పరిశీలిస్తున్నది. భవిష్యత్తులో ఇదొక సమగ్ర క్యాన్సర్ చికిత్సా పద్ధతిగా మారే అవకాశం ఉన్నదని నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
Cancer In India | భారత్‌లో ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి క్యాన్సర్ ముప్పుట..! పరిశోధనలో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు..!
అయితే.. జెమ్‌సిటాబిన్ కూడా ఒక కెమోథెరపీ ఔషధమేనని, టీఏఆర్ దానిని డెలివరీ చేసేది మాత్రమేనని కొందరు పేర్కొంటున్నారు. ఇది ఔషధ డెలివరీ విధానంలో మార్పు మాత్రమేనని అంటున్నారు. ఏది ఏమైనా భారతదేశంలో క్యాన్సర్ రోగులు పెరుగుతున్న క్రమంలో TAR-200 వంటి ఆవిష్కరణలు కొత్త ఆశాకిరణాలు అవుతాయన్న విశ్వసాలు వ్యక్తమవుతున్నాయి. దీని దీర్ఘకాల ఫలితాలు, విస్తృతస్థాయిలో అమలు చేయడం విషయంలో మరింతగా అధ్యయనాలు కొనసాగాల్సిన అవసరం ఉందనే వారూ ఉన్నారు. ఈ అవిష్కరణ క్యాన్సర్ రోగుల్లో ఆశలు చిగురింపచేసినా.. ఈ మార్పును విజయవంతంగా అమలు చేయడానికి సమగ్ర విధానం అవసరమని నిపుణులు తేల్చి చెబుతున్నారు.
Read Also |
IRCTC Best Package: రూ. 5080కే గోదావరి అందాలు, పుణ్యక్షేత్రాలు చుట్టి రావచ్చు
Bus Driver Saves 50 Students | తాను చనిపోతూ..విద్యార్థుల ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్
Vidhaatha Tribute | అందెశ్రీకి ‘విధాత’ నివాళి: “తెలంగాణ ఆత్మను అక్షరాల్లో నింపిన మహాకవి”
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram