DJ Sound | డీజే సౌండ్‌కు.. 140 కోళ్లు బ‌లి..

DJ Sound | ఏ చిన్న శుభ‌కార్యం జ‌రిగినా డీజేలు పెట్టి క‌ర్ణ‌భేరీ ప‌లిగేలా సౌండ్స్ పెడుతుంటారు. మ‌న‌షుల‌కే ఆ సౌండ్‌కు గూబ గుయ్ మంటుంది. మ‌రి అలాంటిది.. కోళ్లు ఆ సౌండ్‌ను త‌ట్టుకోగ‌లుగుతాయా..? అంటే నో అనే చెప్పొచ్చు. ఎందుకంటే.. డీజే సౌండ్‌కు 140 కోళ్లు బ‌ల‌య్యాయి.

  • By: raj |    national |    Published on : Apr 30, 2026 7:41 AM IST
DJ Sound | డీజే సౌండ్‌కు.. 140 కోళ్లు బ‌లి..

DJ Sound | ఏ చిన్న శుభ‌కార్యం జ‌రిగినా డీజేలు పెట్టి క‌ర్ణ‌భేరీ ప‌లిగేలా సౌండ్స్ పెడుతుంటారు. మ‌న‌షుల‌కే ఆ సౌండ్‌కు గూబ గుయ్ మంటుంది. మ‌రి అలాంటిది.. కోళ్లు ఆ సౌండ్‌ను త‌ట్టుకోగ‌లుగుతాయా..? అంటే నో అనే చెప్పొచ్చు. ఎందుకంటే.. డీజే సౌండ్‌కు 140 కోళ్లు బ‌ల‌య్యాయి. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సుల్తాపూర్ జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. సుల్తాన్‌పూర్ జిల్లాలోని రామ్‌భ‌ద్ర పూర్వ గ్రామానికి చెందిన బాబ‌న్ విశ్వ‌క‌ర్మ అనే వ్య‌క్తి త‌న కుమార్తెకు ఏప్రిల్ 25న వివాహం జ‌రిపించారు. ఇక త‌న కుమార్తెను అత్తారింటికి సాగ‌నంపే క్ర‌మంలో డీజే ఏర్పాటు చేశారు. గ్రామం మొత్తం డీజేతో తిరిగి.. త‌న బిడ్డ‌కు వీడ్కోలు ప‌లికారు.

అయితే స్థానికంగా ష‌బ్బీర్ అలీ అనే వ్య‌క్తి పౌల్ట్రీ ఫామ్ నిర్వ‌హిస్తున్నాడు. ఆయ‌న పౌల్ట్రీ ఫామ్ ప‌క్క‌నుంచే రాత్రి 9.30 గంట‌ల‌కు డీజేతో ఊరేగింపుగా వెళ్లారు. ఆ డీజే శ‌బ్దాల‌కు కోళ్ల‌ల్లో వ‌ణుకు పుట్టి గుండె ఆగిపోయింది. మొత్తంగా 140 కోళ్లు ప్రాణాలు కోల్పోయాయి.

దీంతో బాధిత వ్య‌క్తి అలీ.. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. హై డెసిబుల్ సౌండ్ కార‌ణంగానే కోళ్లు చ‌నిపోయాయ‌ని అత‌ను ఫిర్యాదులో పేర్కొన్నాడు. డీజే ఆప‌రేటర్ క‌వి యాద‌వ్‌ను విచారించిన అనంత‌రం చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ప‌రిమితికి మించి సౌండ్ ఉంటే.. చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.