26/11 Attack | ముంబయి ఉగ్రదాడి మాస్టర్‌మైండ్ తహవ్వుర్ రాణాకు యూఎస్ కోర్టులో ఎదురుదెబ్బ.. భారత్‌కు అప్పగించవచ్చన్న అప్పీలేట్ కోర్టు..!
26/11 Attack | ముంబయి ఉగ్రదాడి మాస్టర్‌మైండ్, పాకిస్థాన్‌కు చెందిన కెనడా వ్యాపారవేత్త తహవ్వుర్ రాణాకు అమెరికా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అతన్ని భారత్‌కు అప్పగించవచ్చని అమెరికా అప్పీల్ కోర్టు స్పష్టం చేసింది. దాంతో రాణాను త్వరలోనే భారత్‌కు రప్పించేందుకు మార్గం సుగమమైందని భావిస్తున్నారు.

26/11 Attack | ముంబయి ఉగ్రదాడి మాస్టర్‌మైండ్, పాకిస్థాన్‌కు చెందిన కెనడా వ్యాపారవేత్త తహవ్వుర్ రాణాకు అమెరికా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అతన్ని భారత్‌కు అప్పగించవచ్చని అమెరికా అప్పీల్ కోర్టు స్పష్టం చేసింది. దాంతో రాణాను త్వరలోనే భారత్‌కు రప్పించేందుకు మార్గం సుగమమైందని భావిస్తున్నారు. 2008 ముంబయి ఉగ్రదాడిలో రాణా మోస్ట్ వాంటెడ్,. రెండుదేశాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం.. అతన్ని భారత్‌కు అప్పగించవచ్చని అమెరికా అప్పీల్ కోర్టు పేర్కొంది. తహవ్వుర్ రాణా దాఖలు చేసిన అప్పీల్‌పై సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియాలోని డిస్ట్రిక్ట్ కోర్ట్ రానా హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కొట్టివేయడాన్ని యూఎస్ అప్పీలేట్ కోర్టు న్యాయమూర్తుల ప్యానెల్ సమర్థించింది. భారత్‌కు అప్పగించడాన్ని సవాల్ చేస్తూ రాణా పిటిషన్ దాఖలు చేశారు. రాణాపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికా, భారత్ మధ్య ఉన్న అప్పగింత ఒప్పందం నిబంధనల కిందకే వస్తుందని ప్యానెల్ అంగీకరించింది.
తహవ్వుర్ రాణా పాకిస్థాన్‌లో జన్మించారు. కెడియన్ వ్యాపారవేత్తగా ఎదిగారు. ముంబయి ఉగ్రవాద దాడులకు పాల్పడిన సంస్థకు సహకారం అందించినట్లు ఆరోపణలున్నాయి. డెన్మార్క్‌లో ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నినందుకు.. విదేశీ ఉగ్రవాద సంస్థకు మద్దతుగా నిలిచినందుకు రాణాను జ్యూరీ దోషిగా నిర్ధారించింది. అయితే, ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునే అవకాశం రాణాకు ఇచ్చింది. భారత్‌కు అప్పగించకుండా ఉండేందుకు చట్టపరంగా అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా.. 2008లో పాకిస్థాన్ నుంచి పడవలో వచ్చిన 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబయిలో మారణహోమం సృష్టించారు. దాదాపు 60 గంటలపాటు జనాలను బందీలుగా ఉంచారు. ఉగ్రదాడిలో 160 మందికి పైగా మరణించారు. భద్రతా బలగాలు తొమ్మిది మంది ఉగ్రవాదులను అక్కడికక్కడే హతమార్చగా.. ఓ ఉగ్రవాది అజ్మల్ కసబ్ సజీవంగా పట్టుబడ్డాడు. అనంతరం అతన్ని ఉరి తీశారు. ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో 26 మంది విదేశీయులు సైతం ఉన్నారు.