అరుదైన దృశ్యం.. పిల్ల ఏనుగుకు జడ్ కేటగిరి భద్రత.. వీడియో
జడ్ కేటగిరి భద్రత.. ఈ భద్రత కేవలం దేశంలోని అత్యున్నత పదవుల్లో ఉండే వారికి మాత్రమే కల్పిస్తుంటారు. మరి అలాంటి జడ్ కేటగిరి భద్రత ఓ పిల్ల ఏనుగుకు కల్పించబడింది. ఈ అరుదైన దృశ్యం నెట్టింట వైరల్ అవుతోంది. మీరు ఆ వీడియోను చూస్తే షాక్ అవ్వాల్సిందే.

జడ్ కేటగిరి భద్రత.. ఈ భద్రత కేవలం దేశంలోని అత్యున్నత పదవుల్లో ఉండే వారికి మాత్రమే కల్పిస్తుంటారు. మరి అలాంటి జడ్ కేటగిరి భద్రత ఓ పిల్ల ఏనుగుకు కల్పించబడింది. ఈ అరుదైన దృశ్యం నెట్టింట వైరల్ అవుతోంది. మీరు ఆ వీడియోను చూస్తే షాక్ అవ్వాల్సిందే.
ఐఏఎస్ ఆఫీసర్ సుప్రియా సాహు ఈ అరుదైన వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. పచ్చని అడవిలో ఓ చెట్టు కింద నిద్ర పోతున్న ఓ పిల్ల ఏనుగుకు దాని తల్లితో పాటు ఇతర ఏనుగులు కాపలాగా ఉన్నాయి. అవి కూడా నిద్రలో కూరుకున్నాయి. అయితే పిల్ల ఏనుగుకు మిగతా ఏనుగులు జడ్ కేటగిరి భద్రత కల్పించినట్లు ఉంది.
ఈ అరుదైన దృశ్యం తమిళనాడులోని అన్నామలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఆవిష్కృతమైంది. ఈ దృశ్యాన్ని వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ దాను పరాన్ తన కెమెరాలో బంధించగా, ఆ వీడియోను సుప్రియా సాహు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో అందమైన ఏనుగు కుటుంబం ఎంతో హాయిగా నిద్రిస్తోంది.. చూడండి పిల్ల ఏనుగుకు ఆ కుటుంబం ఏ విధంగా జడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పిస్తోంది.. అలాగే ఓ పెద్ద ఏనుగు కుటుంబ సభ్యుల భద్రతను గమనిస్తూ ఎలా లేచి చుట్టు పక్కల గమనిస్తుందో.. అచ్చం మన కుటుంబంలానే ఉంది కదూ అంటూ సుప్రియా సాహు రాసుకొచ్చారు. 15 సెకన్ల నిడివి గల ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
A beautiful elephant family sleeps blissfully somwhere in deep jungles of the Anamalai Tiger Reserve in Tamil Nadu. Observe how the baby elephant is given Z class security by the family. Also how the young elephant is checking the presence of other family members for reassurance.… pic.twitter.com/sVsc8k5I3r
— Supriya Sahu IAS (@supriyasahuias) May 16, 2024