Dead bodies | ఆ మృతదేహాలతో కువైట్‌ నుంచి కొచ్చికి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్పెషల్‌ ఫ్లైట్‌..

Dead bodies | అగ్ని ప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలను తీసుకుని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (IAF) ప్రత్యేక విమానం కువైట్ నుంచి బయలుదేరింది. ఈ తెల్లవారుజామున కువైట్‌లో టేకాఫ్‌ అయిన విమానం ముందుగా కేరళలోని కొచ్చి (Kochi) కి చేరుకుంటుంది. ఈ విమానంలో కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ కూడా ఉన్నారు.

Dead bodies | ఆ మృతదేహాలతో కువైట్‌ నుంచి కొచ్చికి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్పెషల్‌ ఫ్లైట్‌..

Dead bodies : అగ్ని ప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలను తీసుకుని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (IAF) ప్రత్యేక విమానం కువైట్ నుంచి బయలుదేరింది. ఈ తెల్లవారుజామున కువైట్‌లో టేకాఫ్‌ అయిన విమానం ముందుగా కేరళలోని కొచ్చి (Kochi) కి చేరుకుంటుంది. ఈ విమానంలో కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ కూడా ఉన్నారు. సింగ్ గురువారం కువైట్‌కు చేరుకుని భారతీయుల మృతదేహాలను తీసుకొచ్చేందుకు కావాల్సిన ఫార్మాలిటీస్‌ పూర్తిచేశారు.

విమానం ముందుగా కొచ్చికి వస్తుంది. తర్వాత ఢిల్లీ (delhi) కి వెళ్తుంది. కొచ్చి, ఢిల్లీల్లో ఆయా రాష్ట్రాల ప్రతినిధులకు మృతదేహాలను అందజేస్తారు. మరణించిన 45 మంది భారతీయుల్లో 23 మంది కేరళ వాసులు ఉన్నారు. తమిళనాడుకు చెందినవారు ఏడుగురు, ఆంధ్రప్రదేశ్‌ వాసులు ముగ్గురు, బీహార్‌, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్‌, హర్యానా, పంజాబ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు.

కువైట్‌లోని ఓ భవనంలో బుధవారం తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించడంతో అప్పటికే నిద్రపోతున్న కూలీలంతా లేచారు. మంటలను చూసి ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు పెట్టారు. కొందరు భవనం పైనుంచి దూకి చనిపోయారు. కొందరు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు పొగకు ఊపిరిడాక మరణించారు.

ఈ ప్రమాదంలో గాయపడ్డ మరో 33 మంది కూలీలు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన భారత కార్మికులంతా సురక్షితంగా ఉన్నారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ గురువారం కువైట్‌లోని వేర్వేరు ఆసుపత్రులను సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న భారత కార్మికులను పరామర్శించారు. ప్రమాదం గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.