Delhi Election Survey | ఇప్పటికిప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే గెలిచే పార్టీ అదే? జీ న్యూస్ తాజా సర్వే ఏం చెబుతున్నది?
దేశ రాజధాని ఢిల్లీ.. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య యుద్ధరంగంగా మారింది. 2015 నుంచి ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం కొనసాగుతున్నది. కాంగ్రెస్ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటునూ గెలవలేక పోయింది. బీజేపీ కూడా పెద్దగా విజయాలు సాధించలేదు. 2020 ఎన్నికల్లో 70 సీట్లు ఉన్న అసెంబ్లీలో ఆ పార్టీకి కేవలం ఎనిమిది సీట్లే లభించాయి. అయితే ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాలు సాధించింది. ఈ నేపథ్యంలో ఐసీపీఎల్‌తో కలిసి జీ న్యూస్ ఏఐ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఓటర్ల మనోభావం ఎలా ఉన్నదో అంచనా వేసింది.

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ.. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య యుద్ధరంగంగా మారింది. 2015 నుంచి ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం కొనసాగుతున్నది. కాంగ్రెస్ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటునూ గెలవలేక పోయింది. బీజేపీ కూడా పెద్దగా విజయాలు సాధించలేదు. 2020 ఎన్నికల్లో 70 సీట్లు ఉన్న అసెంబ్లీలో ఆ పార్టీకి కేవలం ఎనిమిది సీట్లే లభించాయి. అయితే ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాలు సాధించింది. ఈ నేపథ్యంలో ఐసీపీఎల్‌తో కలిసి జీ న్యూస్ ఏఐ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఓటర్ల మనోభావం ఎలా ఉన్నదో అంచనా వేసింది.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన అంశాలు ఏమిటని ప్రశ్నించగా.. 30 శాతం మంది లిక్కర్ స్కామ్ అని చెప్పారు. 20 శాతం మంది నీటి కొరతను, 15 శాతం మంది నిరుద్యోగాన్ని, 15 శాతం మంది ట్రాఫిక్ సమస్యను, 10 శాతం మంది విద్యుత్తు సమస్యను ప్రధానాంశాలుగా పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతాయా? అన్న ప్రశ్నకు 50 శాతం మంది అవునని చెప్పారు. 45 శాతం మంది ప్రభావం ఉండబోదన్నారు. అయితే.. లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను, ఆప్ నేతలను అరెస్టు చేయడం తప్పని 55 శాతం మంది అభిప్రాయపడటం గమనార్హం. 35 శాతం మంది మాత్రమే అరెస్టులను సమర్థించారు. కేజ్రీవాల్ అరెస్టు ఆప్‌కు లాభం చేకూర్చుతుందా? అన్న ప్రశ్నకు.. అవునని 15 శాతం మంది చెప్పారు. 65 శాతం మంది వ్యతిరేకంగా స్పందించారు.
ఢిల్లీ పోలీసులపై నియంత్రణ ఎవరికి ఉండాలి?
ఢిల్లీ పోలీసులు ఎవరి నియంత్రణలో ఉండాలన్న విషయంలో కేంద్ర ప్రభుత్వానికి, ఆప్ ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతున్నది. పోలీసులపై తమకే పట్టు ఉండాలని ఢిల్లీ ప్రభుత్వం వాదిస్తున్నది. ఇదే ప్రశ్నను ఢిల్లీ వాసులనడిగితే.. 35 శాతం మంది రాష్ట్ర ప్రభుత్వానికే నియంత్రణ ఉండాలని చెప్పారు. 55 శాతం మంది కేంద్రం చేతిలో ఉండాలని అభిప్రాయపడ్డారు.
ఢిల్లీకి పూర్తి రాష్ట్ర ప్రతి ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నది. ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలని ఆప్ డిమాండ్ చేస్తున్నది. దీనిపై ఢిల్లీ వాసులు స్పందిస్తూ.. పూర్తి రాష్ట్రప్రతిపత్తి ఇవ్వాలని 67 శాతం మంది కోరడం విశేషం. యూటీగానే కొనసాగాలని 25 శాతం మంది చెప్పారు. ఢిల్లీకి రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తామని బీజేపీ కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. కానీ.. ఓటమి అనంతరం ఈ అంశంపై మౌనం దాల్చింది. ఢిల్లీ ఎదుర్కొంటున్న సమస్యలకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కారణమని 54 శాతం మంది అభిప్రాయపడగా.. 46 శాతం మంది సీఎం కేజ్రీవాల్‌ను బాధ్యుడిని చేశారు. సక్సేనా, కేజ్రీవాల్ మధ్య వివాదాల కారణంగా ఢిల్లీ అభివృద్ధి కుంటుపడిందిన 65 శాతం మంది చెప్పడం విశేషం.
నీటి కొరత, ఆరోగ్యం, విద్య ఆరోగ్యం, విద్య రంగాల్లో కేజ్రీవాల్ ప్రభుత్వం కృషి అద్భుతమని 50 శాతం మంది చెప్పగా.. 35 శాతం మంది సంతృప్తిని వ్యక్తం చేశారు. 12 శాతం మంది మాత్రమే బాగోలేదని అన్నారు. నీటి సమస్యపై ఢిల్లీ ప్రభుత్వ కృసి బాగుందని 50 శాతం మంది చెప్పారు. 40 శాతం మంది బాగోలేదని అన్నారు. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ఈ సర్వేలో పదిలక్షల మంది నుంచి అభిప్రాయాలు తీసుకోగా.. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ పనితీరు చాలా బాగుందని 40 శాతం మంది చెప్పారు. బాగుందన్నవారు 35 శాతం ఉండగా.. బాగోలేదన్నది 20 శాతం మాత్రమే.
ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్‌కు 60 శాతం మంది మద్దతు ప్రకటించగా.. మనోజ్ తివారి తమ ముఖ్యమంత్రి చాయిస్ అని 10శాతం మంది మాత్రమే చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని 62 శాతం మంది అభిప్రాయపడ్డారు. 38 శాతం మంది బీజేపీ గెలుస్తుందని చెప్పారు. సీట్ల సంఖ్యకు వచ్చేసరికి ఆప్ 50 నుంచి 60 సీట్లలో గెలుపొందుతుందని, బీజేపీ 12 నుంచి 20 సీట్లు గెలుస్తుందని చెప్పారు. కాంగ్రెస్ సున్నా నుంచి 5 సీట్లలో గెలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.