అన్నాడీఎంకేలో చీలిక..సీఎం విజయ్ కి పెరిగిన మద్దతు

అన్నాడీఎంకేలో చీలికతో సీఎం విజయ్ ప్రభుత్వానికి మద్దతు పెరిగింది. షణ్ముగం వర్గానికి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతు ప్రకటించడంతో బలం 150కి చేరనుంది.

తమిళనాడు సీఎం విజయ్ ప్రభుత్వానికి క్రమంగా మద్దతు పెరుగుతుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీకి కాంగ్రెస్ 5 సీట్లు, రెండు సీట్ల చొప్పున ఉన్న వీసీకే, సీపీఎం, సీపీఐ, ఐయూఎంఎల్ (IUML) పార్టీలు వరుసగా మద్దతు ప్రకటించడంతో మెజార్టీ మార్క్ 118కి మించి ఇప్పటికే ప్రభుత్వ బలం 120కి చేరింది.

తాజాగాఏఐఏడీఎంకే పార్టీ చీలిపోగా.. సీనియర్ నేత షణ్ముగం తన వర్గం 30 మంది ఎమ్మెల్యేలతో టీవీకే చీఫ్ విజయ్‌కు మద్దతు ప్రకటించారు. రేపు అసెంబ్లీలో విజయ్ బలనిరూపణ పరీక్షలో వీరు ప్రభుత్వానికి అండగా నిలవనుండటంతో విజయ్ బలం 150కి చేరనుంది. అన్నాడీఎంకే చీఫ్ పళని స్వామి పక్షాన ప్రస్తుతం 17మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మంగళవారం తమిళనాడు శాసనసభ స్పీకర్‌గా టీవీకే ఎమ్మెల్యే జే.సీ.డీ. ప్రభాకర్ ఎన్నికయ్యారు.

విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

అధికారంలోకి వచ్చిన 48గంటల వ్యవధిలోనే విజయ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థలు, ప్రార్ధనా మందిరాలు, బస్టాండులకు 500 మీటర్ల దూరంలో ఉన్న 717 లిక్కర్ షాపులు మూసివేయాలని ఆదేశించింది. షాపులు తరలించేందుకు 2 వారాల సమయం ఇచ్చింది.

ఇవి కూడా చదవండి :

Trisha | విజయ్ రాజకీయ విజయానికి త్రిషే లక్కీ చార్మ్..? తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారిన స్టార్ జోడీ!
Polycet 2026 | రేపే పాలిసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌.. ఒక్క నిమిషం ఆల‌స్య‌మైనా అనుమ‌తించ‌రు..!

Latest News