ఇంధనం పొదుపు.. సైకిల్‌పై సీఎం సతీమణి రీల్ వైరల్

ఇంధనం పొదుపుగా వాడాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృతా ఫడ్నవీస్ ఆచరణలో పెట్టారు. పెట్రోల్, డీజిల్ ఆదా చేయడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం సైకిల్ తొక్కడం ప్రారంభించారు.

ఇంధనం పొదుపుగా వాడాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృతా ఫడ్నవీస్ ఆచరణలో పెట్టారు. పెట్రోల్, డీజిల్ ఆదా చేయడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం సైకిల్ తొక్కడం ప్రారంభించారు. 5-7 కిలోమీటర్ల పరిధిలోని పనులన్నింటికీ సైకిల్‌‌పైనే వెళ్తున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. ఇంటి నుంచి కార్యాలయం వరకు, షాపింగ్ కోసం సైకిల్ పైనే వెలుతున్నానని, దేశం కోసం ప్రతి ఒక్కరు ఇంధన పొదుపు చేయాలని అమృతా ఫడ్నవీస్ పిలుపునిచ్చారు.

ఆధునిక వస్త్రధారణతో తరచూ పబ్లిక్ ఈవెంట్లలో కనిపించే అమృతా ఫడ్నవీస్.. ఇంధన పొదుపు పేరుతో సైకిల్ పై వెలుతున్న క్రమంలోనూ మోడ్రన్ డ్రస్ లోనే రోడ్డుపై సైకిల్ తొక్కుతూ సందడి చేయడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే వీడియో చూసిన వారికి అదంతా ఓ పబ్లిసిటి రీల్ మాదిరిగా కనిపించినప్పటికి ఉద్దేశం మంచిదైనప్పుడు అభినందించక తప్పదంటున్నారు.  అమృతా ఫడ్నవీస్ సైకిల్ పై ప్రయాణిస్తున్న సందర్బంలో ఆమె సెక్యురిటీ సిబ్బంది కూడా సైకిళ్లపైనే ఆమెను అనుసరిస్తూ బందోబస్తు డ్యూటీ నిర్వహిస్తుండటం గమనార్హం.

 

Latest News