ఇంజిన్ లేకుండానే 3 కిలోమీటర్లు దూసుకెళ్లిన అర్చన ఎక్స్‌ప్రెస్
ఇది షాకింగ్ ఘటన.. ఇంజిన్ లేకుండానే అర్చన ఎక్స్‌ప్రెస్ 3 కిలోమీటర్ల మేర ప్రయాణించింది. చివరకు రైల్వే కీమ్యాన్ అప్రమత్తతో వందలాది మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.
లుధియానా : ఇది షాకింగ్ ఘటన.. ఇంజిన్ లేకుండానే అర్చన ఎక్స్‌ప్రెస్ 3 కిలోమీటర్ల మేర ప్రయాణించింది. చివరకు రైల్వే కీమ్యాన్ అప్రమత్తతో వందలాది మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన పంజాబ్‌లోని ఖన్నా ఏరియాలో ఆదివారం చోటు చేసుకుంది.
పాట్నా – జమ్మూ తావి అర్చన ఎక్స్‌ప్రెస్(12355) ఆదివారం తావికి పాట్నా నుంచి బయల్దేరింది. పంజాబ్‌లోని ఖన్నా ఏరియాలో అనుకోకుండా బోగీల నుంచి ఇంజిన్ విడిపోయింది. దీంతో అర్చన ఎక్స్‌ప్రెస్ 3 కిలోమీటర్ల మేర ప్రయాణించింది. ఇంజిన్ లేకుండా ప్రయాణిస్తున్న రైలును రైల్వే కీమ్యాన్ గుర్తించి, అధికారులను అప్రమత్తం చేశాడు. దీంతో ఇంజిన్ లేకుండా వేగంగా వెళ్తున్న ఆ బోగీలను అధికారులు ఆపేశారు. అనంతరం ఇంజిన్‌ను తీసుకొచ్చి బోగీలకు కలిపారు. అనంతరం రైలు జమ్మూ తావికి బయల్దేరింది.
ఇంజిన్ లేకుండా రైలు ప్రయాణించిందని తెలుసుకున్న తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రైల్వే కీమ్యాన్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. తమ ప్రాణాలను రైల్వే కీమ్యాన్ కాపాడడంతో అతన్ని ప్రయాణికులు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.
Train’s engine got detached and kept running for 3 km before a keyman spotted the engineless coaches and alerted the driver! pic.twitter.com/tFkH6sUQ4y
— Cow Momma (@Cow__Momma) May 6, 2024
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram