Army Chief | ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ పాండే పదవీకాలం పొడిగింపు.. ఆమోదం తెలిపిన కేబినెట్‌ కమిటీ

Army Chief | ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం నెల రోజులపాటు పొడిగించింది. ఆదివారం కేబినెట్‌ అపాయింట్‌మెంట్‌ కమిటీ ఆయన పదవీకాలం పొడిగింపునకు ఆమోదం తెలిపింది. జనరల్‌ మనోజ్‌ పాండే జూన్‌ 30 వరకు ఆర్మీ చీఫ్‌గా కొనసాగనున్నారు. వాస్తవానికి ఆయన ఈ నెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉంది.

  • By: Thyagi |    national |    Published on : May 26, 2024 8:01 PM IST
Army Chief | ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ పాండే పదవీకాలం పొడిగింపు.. ఆమోదం తెలిపిన కేబినెట్‌ కమిటీ

Army Chief : ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం నెల రోజులపాటు పొడిగించింది. ఆదివారం కేబినెట్‌ అపాయింట్‌మెంట్‌ కమిటీ ఆయన పదవీకాలం పొడిగింపునకు ఆమోదం తెలిపింది. జనరల్‌ మనోజ్‌ పాండే జూన్‌ 30 వరకు ఆర్మీ చీఫ్‌గా కొనసాగనున్నారు. వాస్తవానికి ఆయన ఈ నెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉంది.

మనోజ్‌ పాండే 2022 ఏప్రిల్‌ 30న ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. జనరల్‌ ఎంఎం నరవణే స్థానంలో ఆయన ఆర్మీ చీఫ్‌గా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఎక్కువగా పదాతిదళం, ఆర్మర్డ్ అండ్‌ ఆర్టిలరీ అధికారులు ఆర్మీ చీఫ్‌లుగా పనిచేశారు. పాండే ఆర్మీ చీఫ్‌గా నియమితులు కాకముందు తూర్పు ఆర్మీ కమాండర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు.

ఈశాన్య రాష్ట్రాలైన సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ ప్రాంతాల్లో చైనాతో ఉన్న వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి ఈ తూర్పు ఆర్మీ కమాండ్ మోహరించింది. దీని ప్రధాన కార్యాలయం కోల్‌కతాలో ఉంది. లెఫ్టినెంట్ జనరల్ పాండే తూర్పు కమాండ్ అధిపతిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు అండమాన్ అండ్‌ నికోబార్ కమాండ్ కమాండర్ ఇన్ చీఫ్‌గా సేవలు అందించారు.