Plane Crash | అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో బిగ్‌ అప్‌డేట్‌.. బ్లాక్‌బాక్స్‌ల డాటా డౌన్‌లోడ్‌..

‘సీవీఆర్‌, ఎఫ్‌డీఆర్‌ డాటా విశ్లేషణ కొనసాగుతున్నది. ప్రమాదానికి దారి తీసిన పరిణామాలను రీకన్‌స్ట్రక్ట్‌ చేయడమే దీని లక్ష్యం. అదే సమయంలో ఏవియేషన్‌ భద్రత పెంచేందుకు తీసుకోవాల్సిన మరిన్ని అంశాలను గుర్తించేందుకు కూడా ఇది దోహదపడుతుంది’ అని ప్రభుత్వం గురువారం మధ్యాహ్నం వెల్లడించింది.

Plane Crash | అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో బిగ్‌ అప్‌డేట్‌.. బ్లాక్‌బాక్స్‌ల డాటా డౌన్‌లోడ్‌..

Plane Crash | జూన్‌ 12న సంభవించిన అహ్మదాబాద్‌ విమాన ప్రమాదానికి సంబంధించి కీలకమైన బ్లాక్‌ బాక్సులను రికవర్‌ చేసిన నిపుణులు.. దాని నుంచి డాటాను విజయవంతంగా డౌన్‌లోడ్‌ చేశారని ప్రభుత్వ వర్గాలు గురువారం తెలిపాయి. ఫ్లైట్‌ డాటా రికార్డర్‌ లేదా ఎఫ్‌డీఆర్‌, కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ లేదా సీవీఆర్‌లను బ్లాక్‌ బాక్స్‌లుగా వ్యవహరిస్తుంటారు. ఈ ప్రమాదంలో అవి బాగా దెబ్బతినడంతో వాటి నుంచి డాటా రికవరీపై తొలుత అనుమానాలు తలెత్తాయి. డాటా రికవరీ కోసం ఎఫ్‌డీఆర్‌, సీవీఆర్‌లను అమెరికాలోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపే అవకాశాలు ఉన్నాయని గతంలో వార్తలు వచ్చాయి. కానీ.. మన దేశంలోనే వాటి నుంచి డాటా డౌన్‌లోడ్‌ చేసే విషయంలో గొప్ప విజయం సాధించారు.

ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో క్రాష్‌ ప్రొటెక్షన్‌ మాడ్యూల్‌ లేదా సీపీఎంను మెమోరీ మాడ్యూల్‌ను భద్రంగా డౌన్‌లోడ్‌ చేసింది. ఈ రెండు బ్లాక్‌ బాక్సుల్లో ఒకటి విమానం కూలిన హాస్టల్‌ రూఫ్‌ టాప్‌పై లభించింది. మరొకటి విమాన శకలాల్లో లభ్యమైంది. వాటిని మంగళవారం పటిష్ఠమైన రక్షణ మధ్య ఢిల్లీలోని ఏఏఐబీ ల్యాబ్‌కు పంపించారు. మొదటి బ్లాక్‌ బాక్స్‌ మధ్యాహ్నం 2 గంటలకు, రెండో బ్లాక్‌ బాక్స్‌ సాయంత్రం 5.15 గంటలకు చేరుకున్నాయి. అదే రోజు డాటా వెలికి తీసే పని మొదలయ్యింది. బుధవారం నాటికి ఆ పని పూర్తయింది. కాక్‌పిట్‌లో సంభాషణలు, సిబ్బంది స్పందనలు, అక్కడి వాతావరణంలోని శబ్దాలు వంటి విషయాలను సీవీఆర్‌ డాటా వెల్లడించగలదు. ఇక ఎఫ్‌డీఆర్‌లో ఆల్టిట్యూడ్‌, వాయువేగం, ఫ్లైట్‌ కంట్రోల్‌ ఇన్‌పుట్స్‌, ఇంజిన్‌ సామర్థ్యం వంటి పారామీటర్లు ఉంటాయి.

‘సీవీఆర్‌, ఎఫ్‌డీఆర్‌ డాటా విశ్లేషణ కొనసాగుతున్నది. ప్రమాదానికి దారి తీసిన పరిణామాలను రీకన్‌స్ట్రక్ట్‌ చేయడమే దీని లక్ష్యం. అదే సమయంలో ఏవియేషన్‌ భద్రత పెంచేందుకు తీసుకోవాల్సిన మరిన్ని అంశాలను గుర్తించేందుకు కూడా ఇది దోహదపడుతుంది’ అని ప్రభుత్వం గురువారం మధ్యాహ్నం వెల్లడించింది. దీనర్ధం.. అహ్మదబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్‌ తీసుకున్న 36 సెకన్లకే ఈ విమానం ఎందుకు కూలిపోయిందో అర్ధం చేసుకునే క్రమంలో ఒక పెద్ద ముందడుగు పడినట్టేనని అంటున్నారు. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మంది, ప్రమాద స్థలిలో 34 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఒక వ్యక్తి మాత్రం విమానం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు.

ఇవి కూడా చదవండి..

Jurala Project: ప్రమాదంలో జూరాల ప్రాజెక్ట్ గేట్లు
Banakacharla | పోలవరం – బనకచర్ల మనకొద్దంటూ ఏపీలో ఉద్యమం.. కారణాలివే..
Snaking News | స్మార్ట్‌ ఫోన్‌లో ఆ దృశ్యాలు చూస్తూ రెడ్‌హ్యాడెండ్‌గా దొరికిపోయిన పాము!