Bottle Gourd | తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుప్రతికి వ్యక్తి.. కడుపులోని వస్తువును చూసి ఉలిక్కిపడ్డ ఆపరేషన్ చేసిన వైద్యులు..!
Bottle Gourd | మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. తీవ్రమైన కడుపునొప్పితో ఓ వ్యక్తి జిల్లా ఆసుపత్రికి చేరాడు. ప్రాథమిక పరీక్షల అనంతరం వైద్యులు ఎక్స్‌రే తీశారు. ఎక్స్‌రేను తీసిన వైద్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
Bottle Gourd | మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. తీవ్రమైన కడుపునొప్పితో ఓ వ్యక్తి జిల్లా ఆసుపత్రికి చేరాడు. ప్రాథమిక పరీక్షల అనంతరం వైద్యులు ఎక్స్‌రే తీశారు. ఎక్స్‌రేను తీసిన వైద్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రోగి మలద్వారం నుంచి కడుపు వరకు ఎక్స్‌రేలో ఓ పొడవైన వస్తువు కనిపించింది. ఆ తర్వాత సదరు వ్యక్తికి ఆపరేషన్ చేసి కడుపులో నుంచి ఒకటిన్నర అడుగల పొడవైన సొరకాయను గుర్తించారు. దాన్ని తొలగించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సదరు వ్యక్తి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. సిరలు కలిగిపోయాయని.. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు జిల్లా ఆసుపత్రి సర్జన్ నంద్ కిశోర్ జాదవ్ వివరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రెండురోజుల కిందట ఖజురహో ప్రాంతానికి చెందిన వ్యక్తి కడుపునొప్పితో జిల్లా ఆసుపత్రికి చేరుకున్నాడు.
దీంతో ఆసుపత్రిలో వైద్యులు ఎక్స్‌రే తీశారు. కడుపులో ఏదో పెద్ద వస్తువు ఉన్నట్లుగా కనిపించింది. దీంతో ఆలస్యం చేయకుండా నంద్ కిశోర్ జాదవ్ నేతృత్వంలోని బృందం ఆపరేషన్ చేసి ఆ వస్తువును బయటకు తీశారు. కొమ్మతో ఉన్న సొరకాయ కనిపించడంతో అంతా షాక్ అయ్యారు. మలద్వారం నుంచి సొరకాయను లోపలికి చొప్పించి ఉంటారని వైద్యుడు పేర్కొన్నారు. దాంతో మలద్వారంలోని సిరలు బాగా నలిగిపోయాయని.. రోగి పరిస్థితి ఆందోళన కరంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. అయితే, రోగి మానసిక పరిస్థితి బాగా లేదని ఆసుపత్రి సర్జన్ డాక్టర్ నంద్ కిషోర్ జాతవ్ తెలిపారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఇలాగే ప్రవర్తిస్తారన్నారు. సొరకాయ కడుపులోకి ఎలా వెళ్లింది ? ఎవరైనా దానిని బలవంతంగా చొప్పించారా? అన్నది అతడు స్పృహలోకి వచ్చాకే తెలుస్తుందన్నారు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతోందని, పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని వివరించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram