Budget 2024 | గరీబ్ కల్యాణ్ యోజన మరో ఐదేళ్లు పొడిగింపు : విత్తమంత్రి నిర్మలా సీతారామన్
Budget 2024 | గరీబ్ కల్యాణో యోజనను మరో ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆర్థిక మంత్రి మోదీ ప్రభుత్వం 3.0 తొలి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.

Budget 2024 | గరీబ్ కల్యాణో యోజనను మరో ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆర్థిక మంత్రి మోదీ ప్రభుత్వం 3.0 తొలి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్ అభివృద్ధి చెందిన భవిష్యత్తుకు పునాది వేయగలదని.. ఇది 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి రోడ్ మ్యాప్‌ను అందిస్తుందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తొమ్మిది ప్రాధాన్యాలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి బడ్జెట్ ప్రసంగంలో.. ‘’మేం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనను ఐదేళ్లపాటు పొడిగించాం. దాంతో 80 కోట్ల మందికిపైగా పేదలు లబ్ధి పొందుతారు.
ఉపాధి, నైపుణ్య శిక్షణ కోసం ప్రధానమంత్రి ఐదు పథకాల ప్యాకేజీని ప్రకటించారు. దానివల్ల ఐదేళ్లలో 4.10కోట్ల మంది యువతకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకాలకు రూ.2లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నాం. అభివృద్ధి చెందిన భారతదేశానికి రోడ్‌మ్యాప్ ఇస్తామని మధ్యంతర బడ్జెట్‌లో హామీ ఇచ్చాం’ అన్నారు. కేంద్రం తొమ్మిది ప్రాధాన్యాల్లో వ్యవసాయంలో ఉత్పాదకత, ఉపాధి – సామర్థ్య అభివృద్ధి, సంపూర్ణ మానవ వనరుల అభివృద్ధి – సామాజిక న్యాయం, తయారీ – సేవలు, పట్టణ అభివృద్ధి, ఎనర్జీ సెక్యూరిటీ, మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణ.. పరిశోధన – అభివృద్ధి, నెక్స్‌ట్ జెనరేషన్ ఇంప్రూమెంట్స్ ఉన్నాయి.