బిగ్ రిలీఫ్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాను 20% పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. హోటళ్లు, రెస్టారెంట్లకు కొరత లేకుండా చర్యలు, వలస కూలీలకు ఉచిత సిలిండర్లు.

బిగ్ రిలీఫ్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

విధాత: ఎల్పీజీ సిలిండర్ల పంపిణీలో కేంద్రం వినియోగదారులకు భారీ ఊరటనిస్తూ ప్రకటన చేసింది. వాణిజ్య సిలిండర్ల సరఫరా 20% పెంచుతున్నట్లుగా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఎల్లుండి నుంచి రాష్ట్రాలకు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయనున్నట్లుగా పేర్కొంది. హోటళ్లు, రెస్టారెంట్లకు, దాబాలు, క్యాంటీన్లకు గ్యాస్ కొరత లేకుండా చూడాలని రాష్ట్రాలకు సూచించింది.

వలస కూలీలకు ఉచితంగా 5 కిలోల సిలిండర్ ఇవ్వనున్నట్లుగా కేంద్రం వెల్లడించింది. గ్యాస్ సరఫరాపై తీసుకున్న కొత్త చర్యలను వెల్లడిస్తూ.. కేంద్రం అన్ని రాష్ట్రాలు, యూటీలకు లేఖ రాసింది . కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఇవి కూడా చదవండి :

Khammam Road Widening | 594 కోట్లతో ఖమ్మం జిల్లాలో భారీగా రోడ్ల విస్తరణ.. ఈ రోడ్లకు మహర్దశే…
Modi Speaks With Pezeshkian : ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కి ప్రధాని మోదీ ఫోన్