Delhi blast| ఢిల్లీ పేలుళ్లలో ‘మదర్ ఆఫ్ సైతాన్’ !
ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుళ్ల కేసు విచారణ కొనసాగుతున్న కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేలుళ్ల కుట్ర కేసులో నిందితుడు డాక్టర్ ఉమర్ నబీ వాడిన పేలుడు పదార్ధాలు ఏమిటన్న విషయాన్ని ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి. పేలుడుకు ఉపయోగించిన టీఏటీపీ పేలుడు పదార్ధాలను ‘మదర్ ఆఫ్ సైతాన్’గా పిలుస్తారని దర్యాప్తు అధికారులు తెలిపారు.
న్యూఢిల్లీ : ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుళ్ల(Delhi blast) కేసు విచారణ కొనసాగుతున్న కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేలుళ్ల కుట్ర కేసులో నిందితుడు డాక్టర్ ఉమర్ నబీ వాడిన పేలుడు పదార్ధాలు ఏమిటన్న విషయాన్ని ఫోరెన్సిక్ బృందాలు(Forensic Teams)) గుర్తించాయి. అమ్మోనియం నైట్రైట్తో ట్రైఅసిటోన్ ట్రైపెరాక్సైడ్ (టీఏటీపీ) కలిపి పేలుడు పదార్థాన్ని తయారు చేసినట్లుగా తేలింది. ఈ కెమికల్స్ కు కొంత వేడి తగలగానే పేలిపోయే స్వభావం ఉంటుందని భద్రతా వర్గాలు ఈ టీఏటీపీ(TATP explosive) పేలుడు పదార్ధాలను ‘మదర్ ఆఫ్ సైతాన్’(Mother of Satan)గా పిలుస్తారని దర్యాప్తు అధికారులు తెలిపారు.
ఎర్రకోట వద్ద ఐ20 కారులో టీఏటీపీ కెమికల్ మిశ్రమం కారణంగానే భారీ పేలుడు జరిగినట్లు ఫోరెన్సిక్ రిపోర్టు అభిప్రాయపడింది. జమ్ముకశ్మీర్‌లో నౌగామ్ పోలీస్ స్టేషన్లో ఇదే రసాయన సమ్మేళనం నుంచి నమూనాలు సేకరిస్తుండగా భారీ పేలుడు జరిగిందని, ఫరిదాబాద్ లో ఉగ్ర డాక్టర్ల బృందం సిద్దం చేసిన టీఏటీపీని దర్యాప్తు బృందాలు స్వాధీనం చేసుకొన్నాయని వెల్లడించారు.
‘మదర్ ఆఫ్ సైతాన్’ తో గతంలోనూ ఉగ్రదాడులు
‘మదర్ ఆఫ్ సైతాన్’ గా పిలిచే టీఏటీపీ పేలుదు పదార్ధాలతో గతంలో పలు ఉగ్రదాడులు జరిగాయని దర్యాప్తు అధికారులు గుర్తు చేశారు. జులై 2005లోలండన్ బాంబింగ్‌లో టీఏటీపీ పేలుడు దాడిలో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. నవంబర్ 2015 పారిస్ అత్మాహుతి దాడుల్లో, మార్చి 2016 బ్రస్సెల్స్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో టీఏటీపీని వినియోగించారు. ఆ దాడుల్లో మొత్తం 32 మంది చనిపోగా.. 300 మంది గాయపడ్డారు. మే 2017లో జరిగిన మాంచెస్టర్ ఎరీనా పేలుళ్లలో ఐఈడీతో కలిపిన టీఏటీపీ పేలుళ్ల దాడిలో 22 మంది చనిపోయారు.
ఎర్రకోట పేలుడు ఘటనలో సైనిక బుల్లెట్లు లభ్యం
ఎర్రకోట వద్ద కారు పేలుడు ఘటనా స్థలంలో మూడు బుల్లెట్లను ఫోరెన్సిక్ బృందాలు స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. సైనికులు ఉపయోగించే 9 ఎంఎం కార్ట్రిడ్జ్లను ఎర్రకోటకు సమీపంలో స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఆ ప్రదేశంలో వాటికి సందంధించిన ఎటువంటి రివాల్వర్స్ లభ్యం కాలేదన్నారు. ఘటన స్థలంలో దర్యాప్తు చేస్తున్న పోలీసు, భద్రతా సిబ్బంది బుల్లెట్లు కూడా కాకపోవడంతో ..ఆ ప్రదేశానికి భద్రతా బలగాలు వాడే బుల్లెట్లు ఎలా వచ్చాయనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram