Salary Hike | పోయిన ఏడాది రూ.9హైక్ ఇచ్చారు.. ఇప్పుడు అది కూడా ఇవ్వలేదు.. ఢిల్లీ టెక్కీ ఆవేదన వైరల్!

Salary Hike | శాలరీ హైక్‌పై ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేసిన పోస్టు వైరల్‌గా మారింది. జాబ్‌లో చేరాక మొదటి ఏడాది రూ.9 పెంచారని.. ఈసారి అది కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Salary Hike | సాఫ్ట్‌వేర్ జాబ్‌ అంటే లక్షల్లో జీతాలు ఉంటాయి.. ఏటా మంచి ఇంక్రిమెంట్లు ఉంటాయని అందరూ అనుకుంటారు. అలాగే కలలు కని ఎంఎన్‌సీ కంపెనీలో ఐటీ జాబ్‌లో చేరిన టెక్కీకి మాత్రం నిరాశ ఎదురైందట. గత ఏడాది కేవలం రూ.9 మాత్రమే హైక్ ఇచ్చారని.. ఈ ఏడాది అది కూడా ఇవ్వడం లేదని వాపోయాడు. తన బాధను మొత్తం సోషల్‌మీడియాలో పంచుకోగా దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

పోస్టు చేసిన వివరాల ప్రకారం.. ప్రముఖ ఎంఎన్‌సీ కంపెనీలో పనిచేస్తున్న ఓ యువకుడు 2024లో ఇంటర్న్‌గా చేరాడు. ఆరు నెలల తర్వాత సాఫ్ట్‌వేర్ఇంజినీర్‌గా ప్రమోషన్ పొందాడు. ప్రారంభ వేతనం రూ.4.25 లక్షలు అయినప్పటికీ చేతికి వచ్చే జీతం చాలా తక్కువగా ఉందని సదరు ఉద్యోగి తెలిపాడు. ఏటా హైక్ ఉంటుందని ఆశపడితే.. 2025లో కేవలం 9 రూపాయలు మాత్రమే పెంచారని.. 2026లో అది కూడా పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అదే జీతంతో రెండేళ్లుగా పనిచేస్తున్నానని వాపోయాడు.

జీతం పెరగకపోవడంతో జాబ్ మానేద్దామేని అనుకున్నప్పటికీ అందులో అనేక ఇబ్బందులు ఉన్నాయని తెలిపాడు. కనీసం రెండేళ్లు పనిచేయాలని బాండ్ ఉండటం.. బాండ్ బ్రేక్ చేస్తే రూ.1.5లక్షలు చెల్లించాల్సి ఉండటం, అలాగే ఆరు నెలల నోటీస్ పీరియడ్ వంటి నిబంధనలు తనను అదే జాబ్‌లో కట్టిపడేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక జాబ్ విషయానికి వస్తే ఆఫీసుతో పాటు క్లయింట్ వద్దకు వెళ్లి కూడా పనిచేయాల్సి వస్తుందని.. క్లయింట్ దగ్గరకు వెళ్లడానికి ప్రయాణ ఖర్చులు కూడా ఇవ్వడం లేదని వాపోయాడు. ఈ విషయాన్ని ప్రముఖ సోషల్‌మీడియా వేదిక రెడ్డిట్ ద్వారా పంచుకున్నాడు.

ఢిల్లీ టెక్కీ పోస్టుపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. తక్కువ జీతంలో ఉద్యోగులతో పనిచేయించుకునే ప్లాన్ ఇది అని కొందరు వ్యాఖ్యానించగా.. శాలరీ తక్కువ ఉందని నిరాశ చెందడం కాదు.. స్కిల్స్ పెంచుకుని మంచి అవకాశాలు వెతుక్కోవాలని సలహాలు ఇస్తున్నారు.

Read More:

Viral News | మేకప్ కిట్‌నే ఇవ్వలేని వాడివి.. జీవితాంతం ఎలా చూసుకుంటావ్.. పీటల మీద పెళ్లిని ఆపేసిన వధువు

Mangoes | మామిడి పండ్లు మిస్సవుతున్నా అని చెప్పిన ఉద్యోగిని.. లండన్ నుంచి సర్‌ప్రైజ్ ఇచ్చిన బాస్!

 

Latest News