Deve Gowda | లైంగిక దౌర్జన్యం కేసులో బాధ్యులెవరూ తప్పించుకోవద్దు: దేవేగౌడ
అశ్లీల కేసులో తప్పుచేసిన వారిని వదిలిపెట్టవద్దని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ అన్నారు. తన మనుమడు ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల వ్యవహారంపై ఆయన మొదటిసారి స్పందించారు.
విధాత : అశ్లీల కేసులో తప్పుచేసిన వారిని వదిలిపెట్టవద్దని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ అన్నారు. తన మనుమడు ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల వ్యవహారంపై ఆయన మొదటిసారి స్పందించారు. ఈ కేసులో మరికొందరికి సంబంధం ఉన్నదని, బాధ్యలెవరూ తప్పించుకోకుండా చర్యలు తీసుకోవాలని దేవేగౌడ కోరారు.ఈ కేసులో ప్రమేయం ఉన్నవారందని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి చెప్పారు. ఈ కేసులో సంబంధం ఉన్న పేర్లు చెప్పలేనన్న ఆయన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు కిడ్నాప్ కేసుకు సంబంధించి కర్ణాటక మాజీ మంత్రి, ప్రజ్వల్ తండ్రి హెచ్‌డీ రేవణ్ణకు ఇటీవల బెయిల్ వచ్చింది. తనయుడి లైంగిక దౌర్జన్యం ఆరోపణలకు సంబంధించి బాధిత మహిళను అపహరించిన కేసులో 4న ఆయన్ను ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. అరెస్టు సమయంలో ఆయన అధికారులకు సహకరించలేదు. తన తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడ నివాసంలో ఉన్న ఆయనను అరెస్టు చేసేందుకు అధికారులు రాగా.. సాయంత్రం 5.17 గంటల నుంచి 6.50 గంటల వరకు సరైన సమయం కాదని, ఇంట్లో తలుపులు వేసుకుని కూర్చున్నారు. సాయంత్రం 6.50 తర్వాత ఆయన తలుపులు తీసి, సిట్ అధికారుల ముందు లొంగిపోవడం విశేషం. ఇక ప్రజ్వల్‌ను స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం ఫలించలేదు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram