Opinion Polls vs Exit Polls | ఒపీనియన్ పోల్ – ఎగ్జిట్ పోల్.. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి..?
Opinion Polls vs Exit Polls | పంచాయతీ నుంచి పార్లమెంట్ ఎన్నికల దాకా.. ప్రతి ఎన్నిక ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ఏ పార్టీ గెలుస్తుంది..? ఏ పార్టీ అధికారాన్ని చేపట్టబోతుంది..? అనే అంశాలపై అటు రాజకీయ విశ్లేషకులు, ఇటు సామాన్యులు ఎవరికి వారు అంచనాలు వేస్తుంటారు. ఎన్నికల తేదీలు వచ్చినప్పటి నుంచి ఎన్నికలు ముగిసే వరకు అనేక చర్చోపచర్చలు జరుగుతాయి. ఈ చర్చల్లోనే ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ అనే పదాలు తరచుగా వినిపిస్తుంటాయి.

Opinion Polls vs Exit Polls | పంచాయతీ నుంచి పార్లమెంట్ ఎన్నికల దాకా.. ప్రతి ఎన్నిక ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ఏ పార్టీ గెలుస్తుంది..? ఏ పార్టీ అధికారాన్ని చేపట్టబోతుంది..? అనే అంశాలపై అటు రాజకీయ విశ్లేషకులు, ఇటు సామాన్యులు ఎవరికి వారు అంచనాలు వేస్తుంటారు. ఎన్నికల తేదీలు వచ్చినప్పటి నుంచి ఎన్నికలు ముగిసే వరకు అనేక చర్చోపచర్చలు జరుగుతాయి. ఈ చర్చల్లోనే ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ అనే పదాలు తరచుగా వినిపిస్తుంటాయి. మరి ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటో తెలుసుకుందాం.
ఒపీనియన్ పోల్స్
ఒపీనియన్ పోల్స్ అంటే ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే చేపట్టే ప్రక్రియ. అంటే ప్రజల నాడిని తెలుసుకునేందుకు వారి నుంచి అభిప్రాయాలు సేకరిస్తుంటారు. వీటినే ఒపీనియన్ పోల్స్ అంటారు. ఆయా సర్వే సంస్థలు, వార్తాసంస్థలు ఒపీనియన్ పోల్స్‌ను చేపడతాయి. ఓటరు నాడిని పట్టుకునేందుకు వేలాది మందిని సర్వే చేస్తుంటాయి. ఓటరు ఏ పార్టీ/ అభ్యర్థికి ఓటేయాలనుకుంటున్నారు? అనే విషయాలను ఒక్కో ఓటరు నుంచి సేకరించి.. ఎవరు గెలుస్తారనే దానిపై ఒక అంచనా వేస్తారు. ఒపీనియన్ పోల్ ఓటర్ మూడ్‌ను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేగానీ కచ్చితమైన ఎన్నికల ఫలితాలను అంచనా వేస్తుందని చెప్పలేం. ఓటరు చివరి నిమిషంలో మనసు మార్చుకుని వేరే పార్టీకి ఓటేయవచ్చు. అప్పుడు ఎన్నికల ఫలితాలు తారుమారవుతాయి.
ఎగ్జిట్ పోల్స్
ఎగ్జిట్ పోల్స్ అంటే.. ఎన్నికలకు పోలింగ్ జరిగే రోజున చేపట్టే ప్రక్రియ. అంటే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటు వేసి వచ్చిన ఓటరు నుంచి అభిప్రాయాలను సేకరించడాన్ని ఎగ్జిట్ పోల్స్ అంటారు. ఓటరు ఎగ్జిట్ పోల్‌లో ఏ పార్టీకి ఓటేశాననే విషయాన్ని నిజాయితీగా చెప్పే అవకాశం ఉంది. ఎగ్జిట్ పోల్స్ ఎన్నికలు ముగిసిన రోజు వెలువడతాయి. ఓటింగ్‌ను బట్టి ఫలితాలను అంచనా వేసే అవకాశం కూడా ఉంది. ఎగ్జిట్ పోల్స్ ఓటు వేసి వచ్చిన తర్వాత డేటాను సేకరిస్తాయి. అందుకే కొంత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమయ్యే అవకాశం ఉంది.