ఏనుగు ఆరోగ్యం కోసం…జనం ప్రార్థనలు !

ఏనుగు ఆరోగ్యం కోసం భక్త జనం ప్రార్థనలు చేయడం వైరల్ గా మారింది. కర్ణాటక హంపిలోని విరూపాక్ష ఆలయానికి చెందిన 'లక్ష్మి' అనే ఆస్థాన ఏనుగు కోసం స్థానికులు కన్నీరుపెట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఏనుగు ఆరోగ్యం కోసం…జనం ప్రార్థనలు !

విధాత : ఏనుగు ఆరోగ్యం కోసం భక్త జనం ప్రార్థనలు చేయడం వైరల్ గా మారింది. కర్ణాటక హంపిలోని విరూపాక్ష ఆలయానికి చెందిన ‘లక్ష్మి’ అనే ఆస్థాన ఏనుగు కోసం స్థానికులు కన్నీరుపెట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇటీవల ఏనుగు ఆరోగ్యం దెబ్బతినడంతో చికిత్స కోసం కోలార్ తరలించాలని అధికారులు నిర్ణయించారు. ధీర్ఘకాలంగా ఆలయానికి, భక్తులకు సేవలందించి వారి ప్రేమాభిమానాలు సాధించిన ఏనుగు తరలింపును వ్యతిరేకిస్తూ..స్థానికభక్తులు నిరసన తెలిపారు. ఆలయ అధికారులు, వైద్య బృందం భక్త జనానికి సర్దిచెప్పి ఏనుగు ఆరోగ్య పరిస్థితిని వివరించి దానికి చికిత్స ఎంత అత్యవసరమో వివరించారు. దీంతో ఏనుగును తరలించేందుకు అయిష్టంగానైనా అంగీకరీంచిన భక్తులు..దానిని వాహనంలోకి ఎక్కించి తరలించే ముందు తీవ్ర భావోద్వేగంలో కంటతడి పెట్టారు.

వారంతా ఏనుగును పంపిస్తూ మళ్లీ ‘ఆరోగ్యంగా తిరిగిరా లక్ష్మి’ అంటూ కంటతడి పెట్టుకున్నారు. లక్ష్మి కొలుకోని తిరిగి రావాలంటూ దేవుడిని ప్రార్థించారు. ఈ సందర్బంగా భక్తుల కంటనీరు చూసిన గజరాజు సైతం భావోద్వేగానికి గురవుతూ కన్నీటితో భక్తులను ఆశీర్వదించి లారీలో వెళ్లిపోయింది. ఈ ఘటన ఏనుగులు, మానవ సంబంధాలకు మధ్య ఉన్న అనుబంధాలకు నిదర్శనంగా నిలిచింది.