loksabha polls | ఎగ్జిట్‌పోల్స్ చర్చలను బహిష్కరించిన కాంగ్రెస్
తుది దశ పోలింగ్ ముగిసి ఎగ్జిట్‌పోల్ సర్వేలు టీవీ చానళ్లలో హోరెత్తనున్న నేపథ్యంలో వాటిపై చర్చలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయించుకున్నది.exitpolls

ఎగ్జిట్‌పోల్స్ చర్చలను బహిష్కరించిన కాంగ్రెస్
టీఆర్పీ రేటింగ్స్ కోసం జరిగే చర్చలకు వెళ్లం
జూన్ 4 నుంచి టీవీ చర్చల్లో పాల్గొంటాం
ఎక్స్‌లో కాంగ్రెస్ నేత పవన్ ఖేరా వెల్లడి
న్యూఢిల్లీ: తుది దశ పోలింగ్ ముగిసి ఎగ్జిట్‌పోల్ సర్వేలు టీవీ చానళ్లలో హోరెత్తనున్న నేపథ్యంలో వాటిపై చర్చలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయించుకున్నది. అన్ని ఎగ్జిట్‌పోల్ చర్చలను తాము బహిష్కరిస్తున్నామని కాంగ్రెస్ శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు పార్టీ సీనియర్ నేత పవన్‌ఖేరా ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ‘ఎగ్జిట్‌పోల్ చర్చల్లో మా పార్టీ పాల్గొనబోదు’ అని అందులో తెలిపారు. ‘ఓటర్లు ఓటు వేశారు. వారి తీర్పు భద్రంగా ఉన్నది. జూన్ 4వ తేదీన ఫలితాలు వస్తాయి. దానికి ముందు టీఆర్పీ రేటింగ్స్ కోసం ఊహాగానాలు చేసే ఎగ్జిట్‌పోల్స్‌లో భాగం కావాల్సిన అవసరం లేదు’ అని ఆయన తెలిపారు. జరిగే చర్చ ఏదైనా ప్రజలకు సమాచారం ఇచ్చేందుకోసమేనని అన్నారు. తాము జూన్ 4 నుంచి జరిగే చర్చలు సంతోషంగా పాల్గొంటామని స్పష్టం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల తుది విడత పోలింగ్ శనివారం నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం వెల్లువెత్తే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే ఎగ్జిట్‌పోల్స్‌పై సహజంగానే ఆసక్తి నెలకొన్నది. శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ ప్రసారం మొదలు కానున్నది.