సముద్రంలో మునిగిన పడవ..ఏడుగురు మత్స్యకారులు సేఫ్

ప్రయాణిస్తున్న పడవ అకస్మాత్తుగా వీచిన బలమైన గాలులకు మునిగిపోగా..అదృష్టవశాత్తు అందులోని ఏడుగురు మత్స్యకారులు ప్రాణాలతో బయపడ్డారు. తమిళనాడు తీరంలో జరిగిన ఈ సముద్ర ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ప్రయాణిస్తున్న పడవ అకస్మాత్తుగా వీచిన బలమైన గాలులకు మునిగిపోగా..అదృష్టవశాత్తు అందులోని ఏడుగురు మత్స్యకారులు ప్రాణాలతో బయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. తమిళనాడులోని తూత్తుకూడి తీరంలో రెండు రోజుల క్రితం సుగిర్థన్‌ అనే వ్యక్తి మరో ఆరుగురితో కలిసి చేపల వేటకు వెళ్లారు. ఆదివారం బలమైన గాలులు వీయడంతో వారి పడవ సముద్రంలో మునిగిపోయింది.

అయితే ప్రమాదాన్ని ముందే గుర్తించిన మత్స్యకారులు సముద్రంలోకి దూకేసి దగ్గరలోని ట్రావెలర్ పడవని గట్టిగా పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. అదే సమయంలో చేపల వేట కోసం అటుగా వచ్చిన మరో బోటు సిబ్బంది వీరిని గమనించి తమ పడవలోకి ఎక్కించుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ ఏడుగురు మత్స్యకారులకు ప్రాణాలతో బయటపడ్డారు.

 

Latest News