Gold Price Today|తగ్గిన బంగారం ధరలు..కొనుగోలు టైమ్ ఇదే!

Gold Price Today|తగ్గిన బంగారం ధరలు..కొనుగోలు టైమ్ ఇదే!

Gold Price Today:  వారం రోజులుగా పెరుగుతూ వెళ్లిన బంగారం ధర(Gold Pric)లు గురువారం తగ్గుదల(Drop) నమోదు చేశాయి. అదే సమయంలో వెండి ధరలు(Silver Price Drop)కూడా తగ్గు ముఖం పట్టాయి. అయితే బంగారం ధరలు ఒకేసారి రూ.1,360 తగ్గడంతో ఇక కొనుగోలుకు ఇదే సరైన సమయమని భావిస్తున్న కొనుగోలు దారులు పసిడి కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గురువారం హైదరాబాద్ మార్కెట్ లో 22క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,2500తగ్గి రూ.92,550వద్ద కొనసాగుతుంది. 24క్యారెట్ల తులం పసిడి ధర రూ.13,600తగ్గి రూ.1,00,970కు చేరింది. కొల్ కత్తా, బెంగుళూరు, చెన్నై, న్యూఢిల్లీ, ముంబైలలో అవే ధరలు కొనసాగుతున్నాయి.

దుబాయ్ లో 22క్యారెట్ల తులం బంగారం ధర రూ.88,760, 24క్యారెట్లకు రూ.95,809గా ఉంది. అమెరికాలో 22క్యారెట్ల ధర రూ.91,494, 24క్యారెట్ల ధర రూ.96,673గా ఉంది.

మరోవైపు వెండి ధరలు కూడా రూ.1000తగ్గాయి. కిలో వెండి ధర రూ.1,28,000వద్ద కొనసాగుతుంది.