Southwest Monsoon | నైరుతి రుతుపవనాల తిరోగమనం పూర్తి.. ముందుగానే పలకరించిన ఈశాన్య రుతుపవనాలు..
South West Monsoon | నైరుతి రుతుపవనాలు తిరుగోమనం పూర్తయ్యింది భారత వాతావరణశాఖ (IMD) బుధవారం వెల్లడించింది. ఇక ఈశాన్య రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశించాయని పేర్కొంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలోని మధ్యప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని.. రాబోయే 24గంటల్లో వాయువ్య దిశగా ప్రయాణించి మరింత బలపడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

Southwest Monsoon | నైరుతి రుతుపవనాలు తిరుగోమనం పూర్తయ్యింది భారత వాతావరణశాఖ (IMD) బుధవారం వెల్లడించింది. ఇక ఈశాన్య రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశించాయని పేర్కొంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలోని మధ్యప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని.. రాబోయే 24గంటల్లో వాయువ్య దిశగా ప్రయాణించి మరింత బలపడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఆంధ్ర తీరంలో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. మధ్య పశ్చిమ అరేబియా సముద్రంపై ఏర్పడిన అల్పపీడనం రాగల ఆరుగంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పింది.
దాంతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ క్రమంలో తిరువనంతపురం, కొల్లం తదితర తీర ప్రాంతాలకు అధికారులు రెడ్ అలెర్ట్‌ని జారీ చేశారు. ఇదిలా ఉండగా.. ఈశాన్య రుతుపవనాలు తమిళనాడు, పుదుచ్చేరిని తాకాయి. ఫలితంగా చెన్నైతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. బుధవారం సైతం అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ పేర్కొంది. దాంతో ఆయా జిల్లాలకు రెడ్ అలెర్ట్‌ని జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం చెన్నైకి 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉండగా.. గురువారం ఉత్తర తమిళనాడు, దక్షిణాంధ్ర తీరాలను దాటి పుదుచ్చేరి-నెల్లూరు మధ్య చెన్నైకి దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ వివరించింది.