Rakesh Sharma | ఆ యాత్రకు 40 ఏండ్లు.. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి ఇండియన్‌ ఆస్ట్రోనాట్‌..

Rakesh Sharma | ఆ యాత్రకు 40 ఏండ్లు.. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి ఇండియన్‌ ఆస్ట్రోనాట్‌..

Rakesh Sharma : సోవియట్ యూనియన్ (ఇప్పటి రష్యా) మద్దతుతో భారతదేశం స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మను అంతరిక్షంలోకి పంపి 40 ఏండ్లయ్యింది. 2024 ఏప్రిల్‌ 3న అంతరిక్షంలో రాకేశ్ శర్మ చేసిన ఈ చారిత్రాత్మక మిషన్‌కు బుధవారం నాటికి 40 ఏండ్లు పూర్తయ్యాయి. రాకేష్ శర్మ ఇద్దరు రష్యన్ వ్యోమగాములతోపాటు సోయుజ్ T-11 ఎక్స్‌పెడిషన్ ద్వారా 1984 ఏప్రిల్‌ 3న సాయంత్రం 6.18 గంటలకు అంతరిక్షంలోకి దూసుకెళ్లారు.

రష్యా అంతరిక్ష కేంద్రంలో 7 రోజుల 21 గంటల 40 నిమిషాలు గడిపిన తర్వాత వ్యోమగాములు సోయుజ్ T-10 సాయంతో 1984 ఏప్రిల్‌ 11న సాయంత్రం 4.18 గంటలకు భూమికి తిరిగొచ్చారు. కాగా, రాకేష్ శర్మ మిషన్ గురించి, రాబోయే గగన్‌యాన్ గురించి అవగాహన కల్పించడానికి ఇవాళ ఆస్ట్రో స్పేస్ టెక్ క్లబ్‌ను ప్రారంభించారు. ప్లానెటరీ గ్రూప్, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్కృతి స్కూల్‌తో కలిసి పాఠశాల విద్యార్థుల కోసం ఈ ప్రత్యేక సెషన్‌ను నిర్వహించింది.

ముఖ్యంగా NASADIYA (నాసదీయ) అనే ఆస్ట్రానమీ, స్పేస్ టెక్ క్లబ్‌ను ISRO రిటైర్డ్ సైంటిస్ట్ Er రామకృష్ణ పాఠశాలలో ప్రారంభించారు. ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్‌ ఎన్ రఘునందన్‌తోపాటు స్కూల్ డైరెక్టర్లు ఎన్ రేవతి రాజు, యామిని రాజు, బిజినెస్ హెడ్ ఏజేఎస్ ప్రకాష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 200 మంది విద్యార్థులు, క్లబ్ సభ్యులు హాజరయ్యారు.