IRCTC Best Package: రూ. 7210కే తిరుపతి, శ్రీకాళహస్తి, తిరుచానూరు పద్మావతి దర్శనం.

ఐఆర్‌సీటీసీ (IRCTC) 'తిరుపతి బై నారాయాద్రి ఎక్స్‌ప్రెస్' పేరుతో 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో తిరుపతి, శ్రీకాళహస్తి, తిరుచానూరు పద్మావతి దర్శనాలు కవర్ అవుతాయి.

IRCTC Best Package: రూ. 7210కే తిరుపతి, శ్రీకాళహస్తి, తిరుచానూరు పద్మావతి దర్శనం.

తిరుపతి బై నారాయాద్రి ఎక్స్ ప్రెస్ పేరుతో IRCTC కేవలం రూ. 7210కే తిరుపతి, శ్రీకాళహస్తి, తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం ప్యాకేజీని తీసుకు వచ్చింది. ఈ ప్యాకేజీలో పూర్తిగా 3 రాత్రులు, నాలుగు రోజులు కవర్ అవుతాయి. ఈ నెల 17న యాత్ర ప్రారంభం కానుంది.

ప్యాకేజీ పూర్తి వివరాలు:

మొదటి రోజు అంటే 17న సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్‌లోని లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో ట్రైన్ నెంబర్: 12734 ఎక్స్‌ప్రెస్ బయలు దేరుతుంది. సింకింద్రాబాద్‌లో అయితే సాయంత్రం 6.10 గంటలకు, నల్లగొండలో అయితే రాత్రి 7.38 గంటలకు స్టార్ట్ అవుతుంది. రాత్రంతా ప్రయాణమే ఉంటుంది. మరుసటి రోజు తెల్లవారు జామున 5.55 గంటలకు తిరుపతి చేరుకుంటాము. అక్కడి నుంచి హోటల్‌కు తీసుకువెళ్తారు. ఫ్రెషప్ అయ్యాక తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం దర్శించుకుంటాము, తరువాత శ్రీకాళహస్తి దేవాలయాన్ని దర్శించుకుని తిరిగి తిరుపతిలోని హోటల్‌కు చేరుకుంటాము. రాత్రి తిరుపతిలోనే బస చేసి. మరుసటి రోజు అంటే మూడవ రోజు వేకువ జామునే 2.30 గంటలకు శ్రీవారిని ఉచిత దర్శనం చేసుకునేందుకు తిరుమల కొండ మీదకు తీసుకు వెళతారు. స్వామివారిని దర్శించుకున్నాక హోటల్‌కు తీసుకెళతారు. అక్కడ కాసేపు రిలాక్స్ అయ్యాక సాయంకాలం మళ్లీ తిరిగి తిరుపతి రైల్వే స్టేషన్‌లో వదిలేస్తారు. అక్కడి నుంచి రైలు నెంబర్: 12733 ఎక్స్ ప్రెస్ సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరుతుంది. ఆ రోజు రాత్రి అంతా ప్రయాణమే ఉంటుంది. నాలుగవ రోజు తెల్లవారు జామున 3.04 గంటలకు నల్లగొండ, 5.35 గంటలకు సికింద్రాబాద్, 6.45 గంటలకు లింగంపల్లి చేరుకుంటాము.

టికెట్ ధర వివరాలు:

ఈ ప్రయాణంలో కంఫర్ట్, స్టాండర్డ్ రెండు రకాల వెసులు బాటులు ఉంటాయి. కంఫర్ట్ జోన్‌లో అయితే 3ఏసీ టికెట్ ఉంటుంది, హెటల్‌లో ఏసీ గదులు అందుబాటులో ఉంచుతారు. అదే స్టాండర్డ్ మోడ్‌లో అయితే రైల్లో స్లీపర్ క్లాస్ టికెట్, హెటల్‌లో నాన్ ఏసీ గదులు అందుబాటులో ఉంటాయి. కంఫర్ట్ జోన్‌లో వెళ్లాలి అంటే.. ఒక్కరు మాత్రమే వెళ్తే రూ. 13950, స్టాండర్డ్ అయితే రూ. 1280 పడుతుంది. అదే ఇద్దరు కలిసి వెళ్తే ఒక్కొక్కరికి కంఫర్ట్ అయితే రూ. 10860, స్టాండర్డ్ అయితే రూ.8990. ఒకవేళ ముగ్గురు కలిసి వెళ్తే మాత్రం కంఫర్ట్ అయితే ఒక్కొక్కరికి రూ. 9080, స్టాండర్డ్ అయితే రూ. 7210 పడుతుంది. మీ వెంట 5 నుంచి 11 ఏళ్ల పిల్లలు ఉన్నట్లైతే కంఫర్ట్ రూ. 6620 విత్ బెడ్, వితౌట్ బెడ్ అయితే రూ. 5560. అదే స్టాండర్డ్ అయితే విత్ బెడ్ రూ. 4750, వితౌట్ బెడ్ అయితే రూ. 3690 పడుతుంది.

నోట్: పూర్తి వివరాల కోసం IRCTC వెబ్ సైట్‌ను సందర్శించగలరు