Puri Ratna Bhandar | పూరీ జగన్నాథుడి రత్నభాండాగారంలో వెలకట్టలేని సంపద, యుద్ధ అస్త్రాలు..! కీలక వివరాలు వెల్లడించిన జస్టిస్ బిశ్వనాథ్ రథ్..!
Puri Ratna Bhandar | పూరీ జగన్నాథుడి రత్నభాండాగారం రహస్య గది దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత తెరుచుకున్నది. ఈ రత్న భాండాగారంలో వెలకట్టలేని సంపద ఉన్నదని.. ఆయుధాలు సైతం అందులో ఉన్నాయని భాండాగారం అధ్యయన సంఘం అధ్యక్షుడు జస్టిస్ బిశ్వనాథ్ రథ్ తెలిపారు.

Puri Ratna Bhandar | పూరీ జగన్నాథుడి రత్నభాండాగారం రహస్య గది దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత తెరుచుకున్నది. ఈ రత్న భాండాగారంలో వెలకట్టలేని సంపద ఉన్నదని.. ఆయుధాలు సైతం అందులో ఉన్నాయని భాండాగారం అధ్యయన సంఘం అధ్యక్షుడు జస్టిస్ బిశ్వనాథ్ రథ్ తెలిపారు. ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తాము రహస్యగది నుంచి తాత్కాలిక ఖజానాకు తరలించిన సంపద వివరాలు బహిర్గతం చేయరాదన్నారు. చూసింది కేవలం మనుసులోనే ఉంచుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. స్వామి ఆభరణాలతో పాటు యుద్ధాస్త్రాలున్నాయని, ఈ సామగ్రి భద్రంగా ఖజానాలో ఉంచి సీల్ చేసినట్లు పేర్కొన్నారు. ఆయా సంపద, యుద్ధ వస్త్రాలను అంతా వీడియో కూడా తీయించామని అన్నారు. పురావస్తు శాఖ (ASI) చేపట్టనున్న రత్నభాండాగారం మరమ్మతులకు ఎంత సమయం పడుతుందో స్పష్టంగా చేయాల్సి ఉందన్నారు. పనులు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు జరుగుతాయని చెప్పారు. రహస్యగదిలో సొరంగ మార్గం అన్వేషణకు సంబంధించి పనులు పూర్తయిన తర్వాత సంఘం సమావేశమవుతుందన్నారు. లేజర్ స్కానింగ్ చేయించడానికి మార్గదర్శకాలు జారీ చేయాలని ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. సంపద లెక్కింపు భాండాగారం మరమ్మతుల తర్వాతేనని జస్టిస్ బిశ్వనాథ్ రథ్ స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. పూరీ రత్నభాండాగారాన్ని తెరిచేందుకు గతంలో ఎన్నోసార్లు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరిసారిగా 1978లో భాండాగారంలో సంపద లెక్కించారు. ఈ సంపదను లెక్కించేందుకు సుమారు 70 రోజులు పట్టిందని తెలుస్తున్నది. అయినా, ఎంత ఉందనేది లెక్క తేల్చకపోయారని తెలుస్తున్నది. పూర్వకాలంలో ప్రతి మూడు సంవత్సరాలు, ఐదేళ్లకోసారి ఈ గది తలుపులు లెక్కించేవారని సమాచారం. చివరగా తెరిచిన సమయంలో కొన్నింటిని వదిలేయడంతో లెక్కల్లో గందరగోళం నెలకొందని.. నిజనిజాలు తెలియాలని కొందరు వ్యక్తులు హైకోర్టులో కేసు వేయడంతో న్యాయస్థానం.. రత్న భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది. ఈ క్రమంలో పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకున్నది. పూరీ జగన్నాథుడి జగన్నాథ, బలభద్ర, సుభద్రల ఆభరణాలు ఈ రత్న భాండాగారంలో భద్రపరిచినట్లుగా స్థానికులు చెబుతుంటారు. చాలా మంది రాజులు, భక్తులు స్వామి వారికి కానుకలను సమర్పించారు. వీటిని ఇప్పటివరకు పూర్తిగా లెక్కించలేదని.. జగన్నాథ ఆలయం జగ్మోహన్ ఉత్తర ఒడ్డున ఉంది. పూరీ జగన్నాథుడి ఆలయంలోని ఈ రత్న భాండగారంలో అంతర్గత నిల్వ, బాహ్య నిల్వ అని రెండు భాగాలున్నాయి. తరుచుగా వాడని వాటిని అంతర్గత నిల్వలో ఉంచుతారు. అయితే, రత్న భాండాగారం బయటిభాగం ఇప్పటికే తెరిచి ఉంది. కానీ అంతర్గత గదికి సంబంధించిన తాళాలు గత ఆరు సంవత్సరాలుగా కనిపించకుండాపోయాయి.