కర్ణాటక కాంగ్రెస్ లో మళ్లీ సీఎం పీఠం కోసం సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ ల మధ్య లొల్లి మొదలైంది. మరోసారి ఇద్దరు నేతలు తమ మద్దతుదారులో కలిసి ఢిల్లీలో మకాం వేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం అనుకున్న మేరకు తొలి రెండేన్నరేళ్లు సీఎంగా సిద్దరామయ్య పదవీ కాలం ముగిసిపోయినందునా…సీఎం కుర్చీని నాకు వదిలేయాలంటూ డీకే డిమాండ్ చేస్తున్నారు. సీఎం కుర్చీని వదులుకునేందుకు సిద్దరామయ్య ససేమిరా ఒప్పుకోవడం లేదు. దీంతో పార్టీ హైకమాండ్ వద్దనే ఏదో ఒకటి తేల్చుకుందామంటూ ఇరువురు నేతలు కూడా మరోసారి తమ మద్దతుదారులతో కలిసి ఢిల్లీ వెళ్లారు.
నేడు ఖర్గే, రాహుల్‌తో ఇద్దరు నేతల సమావేశం
ఇప్పటికే ఢిల్లీకి చేరిన సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లు నేడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ లను కలువనున్నారు. సీఎం, పీసీసీ మార్పుపై అధిష్ఠానంతో వారిద్దరు చర్చించనున్నారు.
కర్ణాటకలో సిద్దరామయ్య సీఎంగా మూడేళ్లు పదవీకాలం పూర్తయ్యినందునా..మిగిలిన కాలం సీఎం పదవిని తనకు ఇస్తే..రానున్న 2028అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకోచ్చే బాధ్యత తీసుకుంటానంటూ శివకుమార్ చెబుతున్నారు. అయితే తాను సీఎం కుర్చీ నుంచి దిగేది లేదని..దిగాల్సివస్తే మధ్యేమార్గంగా ఎస్సీ సామాజిక వర్గంకు చెందిన పరమేశ్వరన్ కు అవకాశం ఇవ్వాలని సిద్దరామయ్య పావులు కదుపుతున్నారు.
సీఎం మార్పు పంచాయతీతో పాటు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక అంశాలపై సిద్దరామయ్య, శివకుమార్ లు హైకమాండ్ తో చర్చించబోతున్నారు. మరీ ఈ కీలక భేటీ అనంతరం కర్ణాటక కాంగ్రెస్ లో పార్టీ హైకమాండ్ ఏ మార్పులు చేస్తుందోనన్న ఆసక్తి ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతుంది.
ఇవి కూడా చదవండి :
రైతు గోడుపై గొంతెత్తిన ఆర్టీసీ డ్రైవర్ పై వేటు!
ఆ ముగ్గురి ఐపీఎస్ లను సస్పెండ్ చేసిన సీఎం విజయ్
