Ganesh MBBS Doctor| చిన్న డాక్టర్..పెద్ద పట్టుదల

అతని పొడవు కేవలం మూడడుగులు..కాని పట్టుదల ఆకాశమంత ఎత్తు. ఆ పట్టుదలనే అతడిని ఎంబీబీఎస్ డాక్టర్ చేసింది. స్ఫూర్తిదాయకమైన అతడి జీవన పోరాటం ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు అందుకుంటుంది.

Ganesh MBBS Doctor| చిన్న డాక్టర్..పెద్ద పట్టుదల

విధాత, హైదరాబాద్ : అతని పొడవు కేవలం మూడడుగులు..కాని పట్టుదల ఆకాశమంత ఎత్తు. ఆ పట్టుదలనే అతడిని ఎంబీబీఎస్ డాక్టర్ చేసింది. స్ఫూర్తిదాయకమైన అతడి జీవన పోరాటం ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు(Disability Success Story) అందుకుంటుంది. అవమానించిన చట్టాలే..గౌరవ సోపానాలుగా మారిపోయాయి. వివరాల్లోకి వెళ్లితే గుజరాత్‌లోని భావ్‌నగర్‌ జిల్లా(Gujarat Bhavnagar) గోరఖి గ్రామానికి చెందిన డాక్టర్‌ గణేశ్‌(Ganesh MBBS Doctor) ఎంబీబీఎస్ డాక్టర్ కావడానికి పడిన కష్టాలు..అవమానాలు అన్ని ఇన్ని కావు. శారీరక వైకల్యంతో గ్రోత్ హర్మోన్ లోపంతో 2004లో పుట్టిన గణేష్ ఇంటర్ చదివాడు. డాక్టర్ కావాలనే కల సాకారం చేసుకునేందుకు నీట్ పరీక్ష రాసి మంచి ర్యాంకు సాధించాడు. అయితే తన ఎత్తు కేవలం 3అడుగులు అన్న శారీరక వైకల్యం కారణంగా ఆయనకు 2018లో ఎంబీబీఎస్‌లో అడ్మిషన్‌ ఇచ్చేందుకు భారత వైద్యమండలి నిరాకరించింది.

దీంతో గణేష్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గుజరాత్ హైకోర్టులో కేసు వేశాడు. 72శాతం వైకల్యం నేపథ్యంలో హైకోర్టు కేసులో ఓడిపోవడంతో..నిరాశ పడిపోకుండా గణేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టులో కేసు గెలిచిన గణేష్ 2019లో భావ్‌నగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు పొందాడు. వివరించారు. ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసుకుని..నేడు భావ్‌నగర్‌ జిల్లా గోరఖి గ్రామానికి బాండెడ్‌ మెడికల్ ఆఫీసర్‌ హోదాలో ప్రజలకు సేవ చేస్తున్నాడు. డాక్టర్ ప్రజలకు సేవ చేయాలన్న తన జీవితాశయం కొనసాగిస్తున్నట్లుగా..ఇందుకు తాను చాల పోరాటం చేయాల్సి వచ్చిందని తన న్యాయపోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. జీవితంలో ఏదైనా సాధించాలంటే ఎత్తు ముఖ్యం కాదని నిరూపించిన డాక్టర్ గణేష్ పోరాటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతడి పోరాటం స్ఫూర్తిదాయకం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.